Home  »  TV News  »  Brahmamudi : అప్పు, కళ్యాణ్ లని కాపాడిన రాజ్, కావ్య.. ధాన్యలక్ష్మి షాక్!

Updated : Feb 19, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -959 లో..... రాజ్, కావ్య ఇద్దరు కలిసి అప్పు, కళ్యాణ్ లని వెతకడానికి వెళ్తారు. అక్కడ ఒక ఫోన్ కన్పిస్తుంది. ఆ వీడియో అప్పు, కళ్యాణ్ ని కిడ్నాప్ చేసిన వీడియో అందులో ఉంటుంది. అది చూసి ఇది మనకి ఇలా కన్పించిందంటే మనల్ని తప్పు దొవ పట్టించడానికి ఇదంతా అని  ఆ వీడియో ఓపెన్ చేసి.. ఈ వీడియో షూట్ చేసింది ఇక్కడ కాదు ఒకసారి చుడండి అని రాజ్ కి చూపిస్తుంది. అందులో అప్పు, కళ్యాణ్ వెనకాల ఒక ఫ్లెక్సీ ఉంటుంది. అందులో ఉన్న నెంబర్ కి రాజ్ ఫోన్ చేసి మీ ఆఫీస్ అడ్రెస్ ఎక్కడ అని అడుగుతాడు.

దాంతో అతను అడ్రెస్ చెప్తాడు. రాజ్, కావ్య వెంటనే అక్కడికి వెళ్తారు. తాళ్లతో కట్టి ఉన్న అప్పు, కళ్యాణ్ చూసి షాక్ అవుతారు. రాజ్ వెళ్లి వాళ్ళ చుట్టూ ఉన్న రౌడీలని కొడతాడు. వాళ్ళు కూడా రాజ్ ని కొడతారు. అప్పు, కళ్యాణ్ ఇద్దరిని తప్పిస్తాడు రాజ్. వాళ్ళు పరుగెడుతుంటే రౌడీలు వెంబడిస్తారు. అప్పుని కత్తితో పొడవబోతుంటే అప్పుడే రాజ్ వచ్చి ఆపుతాడు. రౌడీలని కొడుతాడు. అప్పటికే అప్పుకి నొప్పులు మొదలవుతాయి. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. ఆ విషయం తెలిసి ఇంట్లో అందరు వస్తారు. అప్పుకి ఎలా ఉందని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఆపరేషన్ కి తీసుకొని వెళ్లారని కళ్యాణ్ చెప్తాడు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా అని రాజ్, కావ్యలని ఉద్దేశ్శించి ధాన్యలక్ష్మి అంటుంది.

నువ్వేం మాట్లాడుతున్నావ్ అమ్మ అని కళ్యాణ్ అంటాడు. మిమ్మల్ని కిడ్నాప్ చేసింది రాజ్, కావ్య కాదా అని ధాన్యలక్ష్మి అంటుంది. అలా ఏం కాదు అమ్మ.. ఎందుకలా అన్నా, వదినని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావ్ .. మన కుటుంబాన్ని తప్పు దోవపట్టించడానికి ఎవరో కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఏం డిమాండ్ చెయ్యడం లేదని కళ్యాణ్ అంటాడు. ప్రాణాలకి తెగించి అన్నా, వదిన మమ్మల్ని కాపాడారని కళ్యాణ్ చెప్పగానే అవునా అని ధాన్యలక్ష్మి పాశ్చాతాపంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.