![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -275 లో... విశ్వ గురించి అమూల్యతో శ్రీవల్లి చెప్తుంటే ప్రేమ వస్తుంది. అమూల్య కాలేజీకి వెళ్ళాక ఏం చేస్తున్నావ్.. ఏదైనా లవ్ స్టోరీ ఉందా అని అడుగుతున్నావ్.. మా అన్నయ్య మంచోడు అంటున్నావ్.. ఏం చేస్తున్నావని శ్రీవల్లిని ప్రేమ అడుగుతుంది. నేనేం చెయ్యట్లేదని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.
మరొకవైపు నర్మద ఆఫీస్ కి వెళ్తుంటే వేదవతి అన్ని పనులు చెప్తుంది. నీకు ప్రమోషన్ వచ్చింది కదా నువ్వు ఏమైనా మారిపోయావా అని టెస్ట్ చేస్తున్నానని వేదవతి అంటుంది. నర్మద బయటకు వెళ్లి, నేను ప్రమోషన్ వచ్చాక మొదటి రోజు ఆఫీస్ కి వెళ్తున్నానని రామరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. నేను మిల్ కి రాను.. నర్మదని డ్రాప్ చేస్తానని సాగర్ అనగానే అదేంటీ వీడికి ఇంత దైర్యం వచ్చిందని తిరుపతి అనుకుంటాడు.
మరొకవైపు ధీరజ్ దగ్గరికి చందు వస్తాడు. డబ్బు తీసుకొని తిరిగి ఇచ్చేస్తాడు. ఇవి నాన్న డబ్బు వెంటనే తన అకౌంట్ కి పంపాలని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కామాక్షి తన లక్ష రూపాయలు కావాలని రామరాజు దగ్గరికి వస్తుంది. రామరాజు మేనేజర్ కి ఫోన్ చేసి పంపమంటాడు. మరొక వైపు రామరాజు అకౌంట్ లో డబ్బు వెయ్యడానికి ధీరజ్ వస్తాడు. అప్పుడే క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మీ అల్లుడు అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసానని మేనేజర్ చెప్తాడు. ఇంకా అందులో ఎంత ఉన్నాయో చెప్పండి అని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |