
జబర్దస్త్ లో జోర్దార్ సుజాత - రాకింగ్ రాకేష్ జోడి చేసే స్కిట్స్ మంచి ఫన్నీగా ఉంటాయి. సుజాత ఎన్నో మూవీస్ లో కూడా సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. ఆమె నటించిన సేవ్ ది టైగర్స్ మూవీలో రోల్ మాత్రం కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుంది. ఆమె భాష, యాస అంతా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఐతే ఆమె సంతోషం అవార్డుని అందుకోబోతోంది. ఈ విషయాన్నీ రాకింగ్ రాకేష్ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలిపాడు. "కంగ్రాట్యులేషన్స్... "సుజాతమ్మ" బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంటున్నందుకు..."సంతోషంగా" మొదలైన ఈ అవార్డుల పర్వం మరిన్ని అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నీ సేవ్ ది టైగర్ " అంటూ పోస్ట్ చేసాడు. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ , ఓటిటి మూవీస్ లో వర్క్ చేసిన ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ కి ఈ 24 వ సంతోషం అవార్డ్స్ ని అనౌన్స్ చేసింది. రాకేష్ - సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ షోకైనా ఈ జంట కలిసి వెళ్తుంది. మిగతా కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ కూడా ఇస్తుంది. ఇష్మార్ట్ జోడిలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పొచ్చు. అలాగే జబర్దస్త్ లో కూడా వెళ్ళు కలిసి స్కిట్స్ వేస్తూ ఉంటారు. రీసెంట్ గా వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. ఇక రాకేష్ ఐతే కెసిఆర్ అనే ఒక మూవీని తీసాడు. ఇక ఈ సేవ్ ది టైగర్స్ మూవీ చేసేటప్పుడు సుజాత ప్రెగ్నెంట్ గానే నటించింది. ఇప్పుడు తన నటనకు అవార్డుని అందుకోబోతోంది.