![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -38 లో....సీతాకాంత్ కి తన చెల్లి ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది. సీతాకాంత్ వాళ్ళ నాన్నే తన చెల్లి కడుపులో పుడతాడని ఒక సెంటిమెంట్ తో మాణిక్యంపై ఎంత కోపం పగ ఉన్నా శత్రువు కొడుకు అయిన సరే సీతాకాంత్ తన చెల్లి సిరిని ధనకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకుంటాడు. అదే విషయం వెళ్లి శ్రీలతకి చెప్తాడు.
ఆ తర్వాత నువ్వు ఒక కొడుకుగా ఒక అన్నయ్యగా ఫెయిల్ అయ్యావని శ్రీలత అంటుంది. అన్నయ్యగా మాత్రం ఫెయిల్ కాలేదు ఒక అన్నగా చెల్లి సంతోషం కోసం ఇదంతా పక్కన పెడుతున్నానని సీతాకాంత్ అంటాడు. అయిన నువు చెప్పింది నాకు ఇష్టం లేదు.. సిరిని శత్రువు ఇంటికి కోడలిగా ఎలా పంపాలి.. నేను ఒప్పుకోనని శ్రీలత అంటుంది.. సిరి ఎక్కడికి వెళ్ళదు ధననే ఇల్లరికం తీసుకొని వద్దాం.. ఆలా అయితేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతామని సీతాకాంత్ అంటాడు. కానీ శ్రీలత మాత్రం సైలెంట్ గా ఉండిపోతుంది. ఆ తర్వాత సీతాకాంత్ రామలక్ష్మిని కలిసి మాట్లాడతాడు. సిరి, ధన ఇద్దరికి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకు అమ్మ ని కూడా ఒప్పించానని సీతాకాంత్ అంటాడు. కానీ ఒక కండిషన్ ధన ఇల్లరికం రావాలని చెప్తాడు. దానికి రామలక్ష్మి షాక్ అవుతుంది. మీ నాన్న ఎంత మోసగాడో నాకు తెలుసు.. నా చెల్లిని అడ్డం పెట్టుకొని ఏదైనా చేస్తే మా జాగ్రత్తలో మేమ్ ఉండాలి కదా ఈ పెళ్లి జరగడం వళ్ళ మీకు లాభం ఉంది ఇక నేను వచ్చి మీ నాన్నని ఏం చేస్తానో అన్న టెన్షన్ లేదు. నేను వదిలేస్తున్న ప్రశాంతంగా ఉండొచ్చు.. మీ ఇంట్లో చెప్పి మీ అభిప్రాయం చెప్పండి అని రామలక్ష్మితో సీతాకాంత్ చెప్తాడు.
ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చి అదే విషయం ఇంట్లో వాళ్లకి చెప్తుంది. ఈ నిర్ణయం ధన తీసుకోవాలని రామలక్ష్మి చెప్తుంది. అందుకు నేను ఒప్పుకోను.. నా కొడుకు ఇల్లరికం వెళ్ళడు. ఆ పిల్లని నా కోడలిగా తెచ్చుకోనని మాణిక్యం అంటాడు. తప్పు చేసింది నువ్వు.. అయినా కూడా వాళ్ళు తన చెల్లి కోసం ఆలోచించారు. ఈ పెళ్లితో ఇక సీతాకాంత్ సర్ నిన్ను ఏదైనా చేస్తాడని టెన్షన్ ఉండదని రామలక్ష్మి అంటుంది. నాకు కొంచెం టైమ్ కావాలని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత మాణిక్యం ధనతో అసలు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు. ఇందులో ఏదైనా ప్లాన్ ఉందా.. సిరిని కనుక్కోమని చెప్తాడు. ధనకి మాణిక్యం ఫోన్ ఇచ్చి సిరికి చెయ్యమంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |