![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -409 లో.. భర్త పాదాలపై భార్య పాదాలు పెట్టి ఇద్దరు దగ్గరగా ఒకరికొకరు చూసుకుంటూ ప్రదక్షిణలు చెయ్యాలని పంతులు గారు చెప్పగానే.. ముకుంద షాక్ అవుతుంది. మరొకవైపు కృష్ణ మురారి ఇద్దరు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఎవరైనా చేస్తారా.. పాపం వాళ్ళకి ఎందుకు బరువు అని ముకుంద అంటుంది. తను తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కృష్ణ, మురారీలకి అర్థం అవుతుంది.
ఆ తర్వాత మురారి పాదాలపై కృష్ణ నిల్చొని మురారిని గట్టిగా పట్టుకుంటుంది. నువ్వు కూడా పట్టుకొని మొదలు పెట్టని ముకుందతో కృష్ణ అంటుంది. ఇక ముకుంద అయిష్టంగా ఆదర్శ్ ను పట్టుకుంటంటే కృష్ణ వచ్చి ఇలా కాదంటూ దగ్గర ఉండి మరీ ఇలా అంటూ చూపిస్తుంది. కానీ ఆదర్శ్ ని ముకుంద పట్టుకొని ఉన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రెండు జంటలు ప్రదక్షిణలు చేస్తుంటారు. అది ఇష్టం లేని ముకుంద ఏం చేసి ఆపాలని అనుకుంటూ తన చేతికి ఉన్న గాజులు పగులగొట్టి కిందకి పడేస్తుంది. ఆ తర్వాత ఆ గాజు ముక్కలపై కాలు వేసిన ఆదర్శ్ ముకుందని వదిలేసి తన కాలుని పట్టుకుంటాడు. అందరు ఆదర్శ్ అరవడంతో ఒక్కసారిగా తన దగ్గరికి వస్తారు.
ఆ తర్వాత అసలు గాజు ముక్కలు ఇక్కడ ఏంటని కృష్ణ అడుగుతుంది. నావే నేను ఆదర్శ్ ని గట్టిగా పట్టుకున్నాను. దాంతో గాజులు పగిలి కిందపడ్డాయని ముకంద యాక్ట్ చేస్తుంటే.. నీ తప్పేం లేదని ఆదర్శ్ అంటాడు. ఇదంతా కావాలనే చేసిందని కృష్ణ, మురారీలు అనుకుంటారు. ఆ తర్వాత గుడిలో అందరు రూపాయి కాయిన్స్ ని నిలబెడుతుంటారు. అది నిల్చొని ఉంటే కోరిక నెరవేరుతుందని రేవతి చెప్పగానే.. నేను నిల్చోపెడతానని మురారిని ముకుంద కాయిన్ అడుగుతుంది. నా కోరిక నీకు తెలుసు మురారి అని ముకుంద అంటుంది. సర్లే అని మురారి అ కాయిన్ ని ముకుందకి ఇస్తాడు. మనం కూడా కాయిన్స్ పెట్టి తన కోరిక నెరవేరదని నిరూపిద్దామని మురారితో కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |