![]() |
![]() |
.webp)
ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని వీడియోలు ఎప్పుడు ట్రెండింగ్ లోకి వస్తాయో తెలియదు. మరికొన్ని చూసి రియాక్ట్ అవ్వాల్సినవి ఉంటాయి. ప్రతీ కూతరికి నాన్నే సూపర్ హీరో.. అలాంటి నాన్నకి ఆరోగ్యం బాలేనప్పుడు కూతురు తనని సంతోషంగా ఉండేలా చూసుకోవాలని చూస్తుంది. గీతు రాయల్ వాళ్ళ నాన్నకి రెండు రోజుల్లో హార్ట్ సర్జరీ ఉందంట. అందుకే వాళ్ల నాన్న చిన్నప్పటి స్నేహితులని వారి ఇంటికి తీసుకొచ్చింది. గీతు వాళ్ళ నాన్నకి తెలియకుండా తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేసింది. కాగా గీతు వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఉన్నాడంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది గీతు.
గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున.
గీతు రాయల్ హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు. అయితే గీతు హౌస్ నుండి బయటకొచ్చాక సీజన్-6 కంటెస్టెంట్స్ ని కలిసి థాయ్ లాండ్ ట్రిప్ కూడా వెళ్ళింది. ఇక రెగ్యులర్ గా బర్త్ డే పార్టీలంటు శ్రీసత్య, వాసంతి కృష్ణన్ లని కలుస్తూ ఉంటుంది గీతు. ప్రస్తుతం గీతు బిగ్ బాస్ సీజన్-7 కి కంటెస్టెంట్స్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ చేస్తుంది. అవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. కాగా ఇన్ స్టాగ్రామ్ లో వాళ్ళ నాన్న హ్యాపీగా ఉన్నాడంటూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
![]() |
![]() |