![]() |
![]() |

అరియాన గ్లోరీ.. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది అరియాన.. అరియాన మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియాన.
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దాంతో అరియాన ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు. అరియాన అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వల్ల అరియానాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియాన చాలా బాధపడింది.
అరియాన ఫ్రెండ్ అమర్ దీప్ బిగ్ బాస్ సీజన్-7 లోకి వెళ్ళిన నుండి అతనికి సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు చేస్తోంది. అయితే ఈ మధ్యే తనని ఒక నెటిజన్ ఆంటీ అన్నాడని బాధపడుతూ వీడియో చేసింది. ఇప్పుడేమో బోల్డ్ లుక్ లోని రెండు ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. చాలామంది నేను ఇలా ఉన్నానని నన్ను జడ్జ్ చేస్తుంటారు. వాళ్ళేలా జడ్జ్ చేస్తారో ఐ డోంట్ కేర్. ఎవరేం అనుకున్నా నాకు నచ్చినట్టే నేనుంటాను అంటు ఈ పోస్ట్ కి ట్యాగ్ లైన్ కూడా రాసుకొచ్చింది అరియాన. రెండు ఫోటోలు అప్లోడ్ చేసిన అరియాన మొదటి ఫోటోలో కంటే రెండో దానిలో కూర్చొని దిగిన ఫోటోకి తెగ కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
![]() |
![]() |