![]() |
![]() |

శ్రీరామచంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి శ్రీరామచంద్ర ఇస్త్రీపెట్టెతో తన బుగ్గను కాల్చుకుని బాధపడుతున్నాడు. ఫ్రెండ్షిప్ డే రోజు శ్రీరామచంద్ర ఒక డ్రెస్ ని ఇస్త్రీ చేసుకుంటూ ఉన్నాడు. సరిగా అదే టైంలో సడెన్గా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి అలవాటులో పొరపాటున సెల్ అనుకుని ఇస్త్రీపెట్టెను చెవి దగ్గర పెట్టేసుకుని తర్వాత గొల్లుమన్నాడు.. ఆ పెయిన్ తట్టుకోలేక బుగ్గ మీద ఐస్ ప్యాక్ పెట్టుకుని ఉపశమనం పొందుతూ ఆండ్రాయిడ్ ని తిట్టుకుంటూ ఉంటాడు. శ్రీరామచంద్ర ఇదంతా ఒక వన్ మినిట్ ఎక్స్ప్రెషన్ స్కిట్ ని వీడియోగా చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసాడు. "రాంగ్ టైంలో ఫోన్ చేసే ఫ్రెండ్స్ అందరి కోసం..హ్యాపీ ఫ్రెండ్షిప్ డే " అంటూ టాగ్ లైన్ పెట్టేసాడు. ఇక ఈ వీడియో చూసిన యాని మాస్టర్ ప్రపంచంలోకెల్లా బిజీ పర్సన్..నాకు ఈ వీడియో చాలా నవ్వు తెప్పించిందంటూ కామెంట్ చేసింది.
ఇంకొంతమంది ఐతే శ్రీరామచంద్ర ఎక్స్ప్రెషన్స్ సూపర్ అన్నారు..ట్రెండ్ ని ఫాలో కావు ట్రెండ్ ని సెట్ చేస్తావ్, ఇన్ని అమేజింగ్ ఐడియాస్ ఎలా వస్తాయో మీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సింగర్ గా శ్రీరామచంద్ర ఎన్నో హిట్స్ సాంగ్స్ పాడారు. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశారు. అలాగే 'ఆహా'లో ఇటీవల టెలికాస్ట్ ఐనా ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షోకి యాంకర్ గా కూడా చేసి సోషల్ మీడియాలో కూడా రీల్స్ చేస్తూ తన ఫాన్స్ ని అలరిస్తూ ఉంటాడు శ్రీరామచంద్ర.
![]() |
![]() |