![]() |
![]() |

విష్ణుప్రియా సోషల్ మీడియాలో ఏది చేసిన ఇట్టే వైరల్ ఐపొతూ ఉంటుంది. ఇక తాజాగా ఒక అద్భుతమైన డాన్స్ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "వర్షాకాలంలో నా ఉదయాలన్నీ చాలా హాయిగా ఉండాలన్నా, నేను కొత్తగా ఉండాలన్నా నాకు ఇలాంటి పాటలే కావాలి. ఇంకా చెప్పాలంటే నా లోపల నాకే తెలియని ఒక కొరియోగ్రాఫర్ ఉన్నాడు. ఇలాంటి పాటలు విన్నప్పుడల్లా బయటికి వచ్చి ఇలా డాన్స్ చేస్తూ ఉంటాడు" అని పోస్ట్ చేసింది. పైజామా వేసుకుని డాన్స్ చేయడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయంటూ కొంటె ఎమోజిస్ ని తగిలించి మరీ పోస్ట్ చేసింది. సెక్సీ యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణు పొట్ట కనిపించేలా డాన్స్ చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. బుల్లి తెర మీద విష్ణుప్రియ ఎంత సందడి చేసిందో అందరికీ తెలుసు. పోవే పోరా షోతో ఈ అమ్మడు మంచి క్రేజ్ ని, పాపులారిటీని సంపాదించుకుంది.
ఇక లేటెస్ట్ గా సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన వాంటెడ్ పండుగాడ్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ లో విష్ణు ఒక హీరోయిన్ గా నటించింది. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ మూవీకి డైరెక్టర్ శ్రీధర్ సీపాన. నేను హీరోయిన్ కాకుండా చనిపోతానేమోనని భయపడ్డాను. కానీ అదృష్టం , అవకాశం ఈ మూవీ రూపంలో వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ విష్ణు చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి. ఇక తాను పోస్ట్ చేసే హాట్ వీడియోస్ ని నెటిజన్స్ తిడుతున్నారనో ఏమో తాజాగా అప్లోడ్ చేసిన వీడియోకి మాత్రం కామెంట్స్ ని లిమిట్ చేసే ఆప్షన్ పెట్టేసుకుని కాస్త జాగ్రత్త పడింది ఈ అమ్మడు.
![]() |
![]() |