![]() |
![]() |
.webp)
అషికా గోపాల్, చందూ గౌడ జంటగా నటించిన సీరియల్ `త్రినయని`. ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, విష్ణు ప్రియ, శ్రీసత్య, భావనా రెడ్డి, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, ద్వారకేష్ నాయుడు తదితరులు నటించారు. బుల్లితెరపై మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికర మలుపులు, ట్విస్ట్ లతో సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మంగళవారం ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరగబోతోంది అన్నది ఇప్పడు చూద్దాం.
నయని, విశాల్ లకు లభించిన పురాతన పెట్టెలో ఏముందో తెలుసుకోవాలన్న కుట్రకు తిలోత్తమ, కసి, వల్లభ తెరలేపుతారు. ఈ విషయంలో నయని చెల్లెలు సుమన సహాయంతో ఆ పెట్టెలో వున్న రహస్యాన్ని తెలుసుకోవాలని మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఈ ప్లాన్ లో భాగంగా సుమన, విక్రాంత్ లని ఓ రోజు మొత్తం నయని, విశాల్ లతో కలిసి వుండమని, నైట్ అక్కడే స్టే చేయమని చెప్పి పంపిస్తుంది తిలోత్తమ. తను చెప్పినట్టుగానే విక్రాంత్ ని వెంటబెట్టుకుని నయని ఇంటికి వెళుతుంది.
వున్నట్టుండి సుమన - విక్రాంత్ లు ఎందుకు వచ్చారో అర్థం చేసుకోలేని నయని వారి రాకతో ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. అంతా కలిసి భోజనం చేశాక కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటారు. అంతా నిద్రపోయాక సుమన తన ప్లాన్ ప్రకారం నయని - విశాల్ లు వెలికి తీసిన పెట్టె లాక్ తీయడం మొదలు పెడుతుంది. ఇంతలో విక్రాంత్ దొంగ దొంగ అంటూ కలవరించడం మొదలు పెడతారు.. దీంతో విశాల్ - నయని ఏం జరిగిందా? అని అటు ఇటు వెతుకుతుంటారు. ఇంతలో నయనికి అనుమానం వస్తుంది. ఇంతకీ మా చెల్లి ఏది అని అడుగుతుంది.. సుమన పెట్టె వెనకాల నక్కి దొరికిపోయాన్రా దోవుడా? అని భయంతో వణికిపోతూ వుంటుంది. ఇంతకీ సుమన ప్లాన్ ని నయని పసిగట్టిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |