Home  »  TV News  »  త్వరలో కొత్త సీరియల్ "ముక్కుపుడక"

Updated : Jun 1, 2022

జీ తెలుగు ఛానెల్ లో త్వరలో ముక్కుపుడక అనే సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇందులో ఐశ్వర్య పిస్సే నటిస్తోంది. ఈమె అగ్నిసాక్షి, కస్తూరి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బేసిక్ గా ఈమె కన్నడ నటి ఐనప్పటికీ తెలుగులోనూ నటిస్తూ అటు కన్నడలో, ఇటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. సర్వమంగళ మాంగళ్య అనే సీరియల్ తో కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అగ్ని సాక్షి సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఐష్. ఐతే మరో సీరియల్ ఆక్టర్ నవ్య స్వామి వాళ్ళ అన్నయ్యని ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక ఇప్పుడు ఆమె నటించిన కొత్త సీరియల్ ముక్కుపుడక త్వరలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ సీరియల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఐశ్వర్య అవని అనే పాత్రలో నటిస్తోంది. ఈమె ఇందులో ఒక టూరిస్ట్ గైడ్ గా డిఫరెంట్ రోల్ లో నటిస్తోంది. ఐశ్వర్యకు జోడీగా రాకేష్ యాక్ట్ చేస్తున్నారు. అతనికి తెలుగులో ఇదే ఫస్ట్ సీరియల్. ఐతే హీరో రాకేష్ అవనితో ప్రేమలో పడతాడు. ఐతే అవనికి ఒక చెడ్డ బావ కూడా ఉంటాడు. ఆమె జీతాన్ని దోచుకు తింటూ ఉంటాడు.

మరో పక్క హీరో తల్లి అన్నపూర్ణ దేవి భక్తురాలు. అమ్మవారికి  నైవేద్యంగా సమర్పించే ప్రసాదం తయారీ రహస్యం తెలుసుకుని ఆ ఊరిని సస్యశ్యామలం చేసి ముందుకు నడిపే కోడలు ఎవరు అంటూ ఆ తల్లిని అడుగుతూ ప్రార్థిస్తుంది. అమ్మవారి ముక్కుపుడకకు హీరో ఫామిలీ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇంతకు ఆ ఇంటికి అవని కోడలిగా వెళ్లబోతోందా ? అత్తగారి నమ్మకాన్ని ఆమె నిలబడుతుందా..? మహాప్రసాదం తయారీ రహస్యాన్ని తెలుసుకుంటుందా ? ఈ విషయాలన్నీ తెలియాలంటే ముక్కుపుడక సీరియల్ కోసం మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.