![]() |
![]() |

బుల్లితెర మీద జబర్దస్త్ గా రోహిణి పండించే కామెడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు రోహిణి ఒక ఎక్స్ప్రెషన్ పెడితే చాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారంతా. అలాంటి రోహిణి ఒక్కో మెట్టు ఎక్కువుతూ ఫిమేల్ ఎంటర్టైనర్ గా ఫిమేల్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఒక పక్కన తాగుబోతు రమేష్ అండ్ టీమ్ తో కలిసి రోహిణి చేస్తున్న కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది. స్కిట్ అయ్యేంత వరకు నవ్వే నవ్వు. ఇక కుకు విత్ జాతి రత్నాలు షోలో కూడా జాతిరత్నంగా అందరినీ నవ్విస్తూ ఉంది రోహిణి.
అలాంటి రోహిణి స్మాల్ స్క్రీన్ మీదనే కాదు బిగ్ స్క్రీన్ మీద నవ్వులు పండిస్తోంది. ముఖ్యంగా సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో రోహిణి యాక్షన్ చూసి నవ్వుకోలేని వాళ్లంతా ఎవరూ ఉండరు. పని మనిషి రోల్ లో నటించింది అనే కంటే జీవించింది అని చెప్పొచ్చు. రోహిణి ఇప్పటి వరకు రాకాస, పెళ్లి కానీ ప్రసాదు, బూట్ కట్ బాలరాజు, భీమా, శివమ్ భజే, మత్తు వదలరా , సేవ్ ది టైగర్స్ ఇలాంటి మూవీస్ వెబ్ సిరీస్ తో రోహిణి దూసుకుపోతోంది.
సేవ్ ది టైగర్స్ 2 సీజన్స్ లో రోహిణి కామెడీ ఒకెత్తు . మిగతా సిరీస్ అంతా ఇంకో ఎత్తు. అంతే కాదు రీసెంట్ సూపర్ సుబ్బు సిరీస్ కోసం చేసిన ఒక ప్రమోషన్ యాడ్ లో ఆటో రాంప్రసాద్ తో పాటు రోహిణి అద్భుతంగా నటించింది. అంతే కాదు డాన్స్ లో కూడా రోహిణికి ప్రావీణ్యం ఉంది. ఆదితో కలిసి డాన్స్ చేస్తూ చేసే రీల్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి మల్టి టాలెంటెడ్ రౌడీ రోహిణిని బెస్ట్ ఫిమేల్ ఎంటర్టైనర్ గా ఐకాన్ అవార్డు వరించింది. సేవ్ ది టైగర్స్ సిరీస్ లో నటనకు ఈ అవార్డుని ఈ నెల 30 న అందుకోబోతోంది.
![]() |
![]() |