![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1012 లో....రాజుకి కాఫీ తీసుకొని రమ్మని ఇందు ఆర్డర్ వేస్తుంది. ఏంటే ఏదో మహారాణి లాగా ఆర్డర్ వేస్తున్నావని రాజు అంటాడు. రాజు కాఫీ తీసుకొని వస్తాడు. అప్పుడే ఆ ఇంటి ఓనర్ వస్తాడు. దాంతో లక్కీ టెన్షన్ పడుతాడు. రాజు, ఇందు వెళ్లి గదిలో ఉన్న అలమరాలో దాక్కుంటారు. లక్కీ డోర్ ఓపెన్ చేస్తాడు. నువ్వు ఏంటి ఇక్కడ అని ఓనర్ అడుగుతాడు. మీరు వస్తున్నారని తెలిసి ఇల్లు క్లీన్ చెయ్యమన్నారని లక్కీ కవర్ చేస్తాడు.
నేను వస్తున్నట్లు ఎవరికి చెప్పలేదు కదా అని అతను అనగానే లక్కీ ఏదో ఒకటి కవర్ చేస్తాడు. ఆ ఓనర్ డైరెక్ట్ రాజు, లక్కీ ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. ఫ్రెషప్ అవ్వడానికి టవల్ తియ్యబోతుంటే లక్కీ వచ్చి అందులో టవల్స్ మొత్తం దుమ్ము పట్టి ఉన్నాయని చెప్పి ఆపుతాడు. ఓనర్ ని ఫ్రెషప్ కి పంపించి రాజు, ఇందుని అందులో నుండి బయటకు రప్పిస్తాడు. వాళ్ళు వెంటనే స్టోర్ రూమ్ లో దాక్కుంటారు. ఆ తర్వాత రాజు బయటకు వచ్చి లక్కీ ఫ్రెండ్ ని అంటూ ఓనర్ తో పరిచయం చేసుకుంటాడు. నేను ఇండియా ఫుడ్ తిని చాలా రోజులు అవుతుంది.. నేను చెప్పినవి అన్ని నాకు చేసి పెట్టండి అని రాజు, లక్కీకీ ఓనర్ ఆర్డర్ వేస్తాడు. దాంతో వేరే దారి లేక ఇందు దగ్గరికి వచ్చి వంటలు చేయమని రిక్వెస్ట్ చేస్తారు.
నేను చెయ్యనని ఇందు మొండిగా ఉంటుంది. ఆ తర్వాత రాజు రిక్వెస్ట్ చెయ్యగానే ఇందు ఒప్పుకుంటుంది. వంటలు చెయ్యడం మొదలుపెడుతుంది. మరొకవైపు ఓనర్ కి లక్కీ డ్రింక్ ఏర్పాటు చేస్తాడు.ఆ తర్వాత కిచెన్ లోకి ఓనర్ వచ్చి వంట చేస్తున్న ఇందుని చూసి ఈ అమ్మాయి ఎవరని అడుగుతాడు. దాంతో ఓనర్ మత్తులో ఉన్నాడని లక్కీ కవర్ చేస్తాడు. తరువాయి భాగంలో ఇందుని తీసుకొని రాజు బయటకు వెళ్తాడు. నాకు ఐస్ క్రీమ్ దొంగతనం చేసి తినాలని ఉందని ఇందు అనగానే రాజు అలాగే ఐస్ క్రీమ్ దొంగతనం చేసి తీసుకొచ్చి ఇందు తినేలా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |