![]() |
![]() |

ఏ పండగైనా, ఏ వ్రతం ఐనా భార్య భర్తలు కుటుంబం అంతా కలిసి చేసుకోవడం ఆనవాయితీ. కానీ కొంతమందికి మాత్రం అలా ఏమీ ఉండదు..పెళ్లి కాకుండా కలిసి వ్రతాలు, పూజలు చేసేస్తూ ఉంటారు. ఈ ఆనవాయితీ బుల్లితెర సెలబ్రిటీస్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రియాంక జైన్, శివ్ కుమార్ విషయంలో అలాగే జరిగింది. ఇక నెటిజన్స్ ఐతే మాములుగా కామెంట్స్ చెయ్యట్లేదు. బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర హీరోయిన్ ప్రియాంక జైన్ వరలక్ష్మీ వ్రతం చేసుకున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. వరలక్ష్మీ వ్రతం అంటే పెళ్లి కాని అమ్మాయిలు తమకు మంచి భర్త రావాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు. మరి ప్రియాంక జైన్ కి పెళ్లయిందా అంటే కాలేదు. కలిసి ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి అంటూ వ్యూస్ కోసం కూడా ఎన్నో వీడియోస్ చేశారు..పెళ్లి చేసుకోకుండానే అన్ని గుడులకు, విహార యాత్రలకు వెళ్లారు.
ఇక ఈ వరలక్ష్మి వ్రతం విషయం నెటిజన్స్ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే.."బాగా చేశారు..కానీ ఇది పెళ్ళైన వాళ్ళు చేస్తారు...ఇదేంటండి చాలా మంది పెళ్లి కాకపోయినా కూడా వ్రతాలు కలిసి కూర్చుని మరీ చేసుకుంటున్నారు. మీరే కాదు..చాలామంది సెలబ్రిటీస్ ఇలానే చేస్తున్నారు. ఇలా చేయడం అంత బాగోదేమో..మీరు ఒక్కరైనా చేసుకోవచ్చు. లేదా పెళ్లి అయ్యాకైనా చేసుకోవచ్చు. ఇలా పెళ్లి కాకుండా ఇద్దరూ కలిసి చేసుకోవడం ఎం బాలేదండి. పెళ్లి చేసుకోకుండా శివ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఏంటండీ...? పెళ్లి చేసుకోరు కానీ అన్నీ చేసేస్తున్నారు చూడలేకపోతున్నాం... పెళ్లి తప్ప అన్నీ చేసుకుంటారు అదేంటో మరి ?" అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |