![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో వరెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరంటే దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, రీతూ చౌదరి, కళ్యాణ్, డీమాన్ పవన్ అని చెప్తారు. ఎందుకంటే వీరిది గేమ్ ఏం లేదు.. అలాగే కంటెంట్ ఏం లేదు.. మరో వైపు ఓనర్స్ భరణి, సంజన, ఇమ్మాన్యుయల్, తనూజ ఇలా అందరు తమ సైడ్ నుండి కంటెంట్ ఇస్తున్నారు.
ప్రియా శెట్టి మూడో వారం హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యాక.. తనకి ఓ క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే తను హౌస్ లో తక్కువ రోజులు ఉంది. ఇక డీమాన్, శ్రీజ, కళ్యాణ్, ప్రియా అంతా బిగ్ బాస్ పెట్టిన అగ్నిపరీక్షని దాటుకొని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అక్కడ తమేంటో నిరూపించుకున్న వీళ్ళు హౌస్ లోకి రాగానే రిలాక్స్ అవుతూ అటిట్యూడ్ చూపించారు. దాంతో బిబి ఆడియన్స్ దృష్టిలో కామనర్స్ వేస్ట్ అని అనుకుంటున్నారు. ఈ వారం ప్రియా శెట్టి, పవన్ కళ్యాణ్ డేంజర్ జోన్ లో ఉండగా.. ప్రియా శెట్టి ఎలిమినేషన్ అయింది. అందుకే ప్రియా శెట్టి తన ఎలిమినేషన్ కి పెద్దగా షాక్ అవ్వలేదు.
ఒక కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రియా శెట్టి రెమ్యునరేషన్ ఓసారి చూసేద్దాం... కేవలం మూడు వారాలు ప్రియా శెట్టి హౌస్‌లో ఉన్నందుకుగాను రూ. 2 లక్షల 40 వేలు (వారానికి రూ. 80,000 చొప్పున) పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి సంబంధాలు వస్తున్నా వద్దని, సినిమాల్లోకి వెళ్లాలనే లక్ష్యంతో తల్లిదండ్రులతో పోరాడి మరీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది ప్రియా శెట్టి. ఇక మూడో వారమే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
![]() |
![]() |