![]() |
![]() |

జయమ్ము నిశ్చయమ్మురా షో ద్వారా ఎన్నో విషయాలను ఆడియన్స్ తెలుసుకుంటున్నారు. ఈ వారం షోకి డాన్స్ మాస్టర్ ప్రభుదేవా రాబోతున్నారు. ఇక ప్రభుదేవా గురించి ఒక్క ముక్కలో చెప్పలేం. ఎలాంటి డాన్స్ స్టైల్స్ తెలియని టైములో ఆయన తన ఓన్ స్టెప్స్ తో ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నారు. అలాంటి ప్రభుదేవాని జగపతి బాబు ఇంటర్వ్యూ చేశారు. "ఆయన డాన్స్ చూడగలం కానీ..రెండున్నర గంటలు ఆయన్ని హీరోగా ఎలా చూస్తాం అనే మాట విన్నావా ఇంతకుముందు " అని జగ్గు భాయ్ అడిగేసరికి "కరెక్ట్ కదా" అన్నాడు ప్రభుదేవా. "మాములుగా బ్లేజర్ అది వేసుకోవు కదా" అని అడిగేసరికి "గెస్ట్ కన్నా హోస్ట్ భయంకరమైన స్టైలిష్ గా ఉన్నారు.
అందుకే నేనే వెళ్లి ఈ బ్లేజర్ ని కొనుక్కున్నా" అన్నాడు ప్రభుదేవా. "నాకు ఆ ప్రభుదేవా అంటేనే ఇష్టం" అని చెప్పారు జగ్గు భాయ్. అంతే వెంటనే ప్రభుదేవా బ్లేజర్ తీసేసి ప్రశాంతంగా కూర్చున్నారు. "డాన్స్ చేయలేని వాళ్ళతో కూడా చేయించావ్. నాకు డాన్స్ వస్తుందా రాదా" అని అడిగేసరికి ప్రభుదేవా లేచి జగ్గు భాయ్ తో కొన్ని స్టెప్స్ వేయించారు. "నీ లవ్ స్టోరీ హిమానీ గారిని ఎక్కడ కలిశారు" అని అడిగారు. "అరచేతిలో పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ తగ్గించడానికి వచ్చారు. కానీ ఇంకా ఈ నొప్పి తగ్గలేదు" అన్నారు ప్రభుదేవా. "నీ శిష్యుల్లో ఏకలవ్య శిష్యుడు" అని అడిగారు. "శేఖర్, జానీ" అనేసరికి వెనక నుంచి జానీ మాస్టర్ వచ్చాడు. "ఈయన ఒక్క సాంగ్ కె 5 సాంగ్స్ మూవ్మెంట్స్ ఇచ్చేస్తాడు. 100 రూపీస్ కి 100 రూపీస్ చెయ్..500 రూపీస్ చేయొద్దు అంటూ జానీ మాస్టర్ కి ప్రభుదేవా సలహా ఇచ్చారు.
![]() |
![]() |