![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -846 లో.. వసుధార ఇంకా కాలేజీకి రాలేదేంటని రిషి ఆలోచిస్తుంటాడు. అప్పుడే పాండియన్ వచ్చి.. మేడం ఇంకా రాలేదని అంటాడు. ఒకసారి కాల్ చేయమని రిషి చెప్తాడు. కాల్ చేసే లోపే వసుధార కాలేజీకి వస్తుంది. అలా వచ్చిన వసుధార.. ఏదో ఆలోచిస్తున్నట్లు రిషి పక్కన వెళ్తు కూడా చూడనట్టుగా వెళ్తుంది.
ఆ తర్వాత వసుధారని రిషి పిలుస్తాడు. ఏమైంది మేడమ్? ఎందుకు లేట్ అయింది. నిన్న ఒక మెసేజ్ పంపి డిలీట్ చేశారేంటని రిషి అడుగుతాడు. నా దగ్గర సమాధానం లేదని వసుధార వెళ్లిపోతుంటే.. ఆగండి మేడమ్ ఒకసారి ఇటు చూడండని అనగానే.. వసుధార చూస్తుంది. ఏంటి మేడమ్? ఆ కళ్ళలో నీళ్ళేంటి? ఏమైందని అడుగుతాడు. ఏం లేదని వసుధార చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వసుధార క్లాస్ కి వెళ్లి పరధ్యానంలో ఉండేసరికి.. పాండియన్ వచ్చి ఏంటి మేడమ్ అలా ఉన్నారని అడుగుతాడు. ఏం లేదు నిన్నటి హోమ్ వర్క్ తీసుకొని రండి అని వసుధార చెప్తుంది. స్టూడెంట్స్ అందరు ఒక్కొక్కరుగా నోట్స్ తీసుకొని వస్తుంటారు. వసుధార ఏంజెల్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ.. స్టూడెంట్స్ చేసిన సమ్ తప్పని అందరికి నోట్స్ లో ఇంటు మార్క్ వేస్తుంది. ఇదేంటి ఇది కరెక్ట్ కదా మేడమ్? ఇలా వేస్తున్నారేంటని పాండియన్ అనుకుంటాడు. మరొక వైపు శైలేంద్ర ఏం చేసినా ప్లాన్ పెయిల్ అవుతుందని కోపంగా ఉంటాడు. అప్పుడే దేవయాని వచ్చి.. నువ్వు తొందరపడుతున్నావ్? అలోచించి చేయమని దేవయాని చెప్పగానే.. శైలేంద్ర తనపై కోప్పడతాడు. మరొకవైపు జగతి, మహేంద్ర కాలేజీ అడ్మిషన్స్ రిషి అలోచించి ఇలా చెయ్యడం సంతోషంగా ఉందంటూ మాట్లాడుకుంటారు.
మరొకవైపు పాండియన్ రిషి దగ్గరకి వచ్చి.. క్లాస్ లో వసుధార ఉన్న తీరు చెప్పి.. ఈ సమ్ చూడండని చెప్తాడు. అది చూసి కరెక్ట్ అని రిషి చెప్పగానే.. మరి వసుధార మేడమ్ క్లాస్ లో ఉన్న అందరికి ఇలానే చేసారు. మేడం దేని గురించో ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఇలా ఇంతకముందు ఎప్పుడు లేరని వసుధార గురించి పాండియన్ చెప్తాడు. సరే నేను తెలుసుకుంటానని రిషి చెప్తాడు. ఆ తర్వాత రిషి చక్రపాణిని కలిసి.. అసలు ప్రాబ్లమ్ ఏంటని అడుగుతాడు. ఏమైంది డల్ గా ఉందని రిషి అనగానే.. ఇంకేం ఉంటుంది మీ గురించే ఆలోచిస్తుందని చక్రపాణి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |