![]() |
![]() |

బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక ఇంటరెస్టింగ్ రాయలసీమ లేడీ కంటెస్టెంట్ ప్రియా కర్నూల్ నుంచి వచ్చింది. ఇక శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. "వీకెండ్ వస్తుంది. నాగార్జున గారు వస్తారు. నువ్వు ట్రాన్సఫార్మ్ ఐపోవాలి ఎం చేస్తావో చూస్తా" అంది. "వన్ మినిట్ మాత్రమే టైం" అంది బిందు మాధవి. ఇక ప్రియా మేకప్ చేసుకుంటూ ఉండగా "నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా" అని అడిగింది శ్రీముఖి. "లేదండి సంబంధాలు చూస్తున్నారండి.

నేను సింగల్ గా ఉన్నా కదా ఈ సిట్యువేషన్ లో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి మరి" అంది ప్రియా. "నీ ప్రాబ్లమ్ ఏంటి అబ్బాయిలు ఎందుకు నచ్చట్లేదు" అని నవదీప్ అడిగాడు. 'ఒకళ్ళు పొడుగ్గా ఒకళ్ళు పొట్టిగా ఉంటారు" అంది. "అబ్బాయిలంటే ఎలా ఉండాలి నీ దృష్టిలో" అని అభిజిత్ అడిగాడు. "రెస్పెక్ట్ ఇవ్వాలి, కేరింగ్ చూపించాలి" అంది. "ఐతే నీకు నవదీప్ ఒకే నా" అని శ్రీముఖి అడిగేసరికి "నేను పెళ్లి సంబంధం మాట్లాడానికి వచ్చాను" అంటూ ప్రియా దగ్గరకు వెళ్లి "నీకు ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం" అని అడిగాడు. "హ్యాండ్సమ్ గా ఉండాలి ..ఉన్నారు. నాకంటే హైట్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే రీల్స్ చేస్తున్నా." అని చెప్పింది. "మీరు ఒకసారి కోల్డ్ డిప్ చేయండి నేను షూట్ చేస్తాను" అన్నాడు. వెంటనే గిన్నెలో ఉన్న ఐస్ క్యూబ్స్ లో ముఖాన్ని పెట్టింది ప్రియా. "తల ఐస్ క్యూబ్స్ లో ముంచేటప్పుడు మా అబ్బాయి నవదీప్ లో ఉన్న క్వాలిటీస్ చెప్తూ ముంచు" అంది. "బాగున్నారు..బాగా మాట్లాడుతున్నారు.. రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పటికైతే " అంటూ తలను డిప్ చేసింది. ఇంకో క్వాలిటీ చెప్పు అని శ్రీముఖి అడిగింది. "నేను మీ గురించి చెప్పొచ్చా మా అత్తగారు చాలా బాగున్నారు ..ఇద్దరం కలిసి రీల్స్ చేద్దాం..అత్తాకోడళ్ల రీల్స్ ట్రెండింగ్ అండి ఇప్పుడు " అంటూ శ్రీముఖిని అత్తగారిని చేసేసింది. దాంతో శ్రీముఖి షాకయ్యింది. "అరేయ్ అబ్బాయి నవదీప్ నాకు కోడలు పిల్ల నచ్చేసింది" అంటూ ప్రియా చేతిలో నవదీప్ చేతిని పెట్టేసింది. "చక్కగా ఉంది..టాస్క్ ఇస్తే తప్పించుకునే చలాకి పిల్లలా ఉంది" అంటూ గ్రీన్ ఇచ్చాడు. "మీలో ఒక కోణం చూసాం మరి ఇంకో కోణం మేము చూడలేకపోయాం " అంటూ అభిజిత్ రెడ్ ఇచ్చాడు. "ఒక వెర్షన్ చూపించావ్..మంచి మాట్లాడుతున్నావ్, ఇంటరెస్టింగ్ పర్సనాలిటీ, క్యూట్ గా ఉన్నావ్, ఎంటర్టైన్ చేస్తున్నావ్" అంటూ బిందు మాధవి గ్రీన్ ఇచ్చింది. "మీరు హోల్డ్ లో ఉన్నారు" అంటూ శ్రీముఖి ఆమెకు చెప్పింది.
![]() |
![]() |