![]() |
![]() |
.webp)
జెమినిలో రీసెంట్ గా మొదలైన కామెడీ షో మాస్ జాతర ఆడియన్స్ ని నవ్విస్తోంది. ఇక రీసెంట్ ఎపిసోడ్ చూస్తే అందులో జడ్జెస్ గా ఉన్న నవదీప్ - జానీ మాస్టర్ డ్రెస్ లు హాట్ టాపిక్ అయ్యాయి. అసలు వాళ్ళ డ్రెస్సులు చూస్తే నవ్వొచ్చే విధంగా ఉన్నాయి. "ఏంటి ఈరోజు అందరూ చాలా జోష్ మీద ఉన్నారు " అంటూ హోస్ట్ దీపికా పిల్లి అడిగింది. వెంటనే నవదీప్ "సాటర్డే నైట్ మాములుగా నాకు ఇలా ఎనెర్జీ ఉంటుంది. షూటింగ్ పెడితే షూటింగ్ లో ఎనెర్జీ చూపిస్తా లేదంటే బయట చూపిస్తా " అన్నాడు.
"నవదీప్ గారు ఇందాకటి నుంచి బాగా కొట్టేస్తోంది మీ కాస్ట్యూమ్ ఏంటి కొంచెం చెప్పండి అదేంటో " అని హోస్ట్ అడిగింది. "నాకు గాలి ఆడే బట్టలంటే ఇష్టం. నాకు చెమటంటే చిరాకు. మాములుగా పంచె, లుంగీ కిందేసినప్పుడు బాగా గాలి ఆడుతుంది. అది పైన ఎందుకు వేసుకోకూడదు అని డౌట్ వచ్చి దాంతో ఇలాంటి డ్రెస్ చేయించా. ఎలా ఉంది
"అన్నాడు. వెంటనే దీపికా "నవదీప్ గారు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. నాలాంటి నాటీ గర్ల్స్ వచ్చి అక్కడ దాచుకుంటారు " అంటూ తెలీకుండానే డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడేసింది. దాంతో నవదీప్ పడీ పడే నవ్వాడు. ఇక జానీ మాస్టర్ డ్రెస్ గురించి అడిగింది హోస్ట్. ఐతే డిజైనర్ కి మాష్టర్ ఇచ్చిన బ్రీఫ్ ఒకటైతే అక్కడ వచ్చింది ఇంకొకటి అని చెప్పారు. ఇక జానీ మాష్టర్ దీపికాని చూసి చాలా బాగున్నావ్ అన్నాడు. అంతే ఆమె తెగ సిగ్గుపడిపోయింది. ఇక అందరూ కాస్ట్యూమర్స్ కి ధన్యవాదాలు చెప్పుకున్నారు.
![]() |
![]() |