![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే వారం పూర్తయింది. సెకెండ్ వీక్ నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో భరణి-మనీష్, రీతూ చౌదరి-మనీష్, తనూజ-మాస్క్ మ్యాన్ హరీష్, ఫ్లోరా సైనీ-తనూజల మధ్య నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ నామినేషన్ బ్యాలెన్స్ ఉంది.
బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss 9 Telugu) లో సామాన్యులు కాస్త ఓవర్ గా చేస్తున్నారు. శ్రీజ-మనీష్ గొడవ పడ్డారు. నీ పనే అరవడం కదా అని శ్రీజతో మనీష్ అనేసరికి ఆమె హర్ట్ అయింది. పాయింట్ అవుట్ చేసేస్తున్నారని మూలకు వెళ్లి ఏడవడం నీ పని అని మనీష్ కి ఇచ్చిపడేసింది శ్రీజ.. కామనర్స్ అనేదానికి వీళ్లు ఓ గలీజ్ మార్క్, వరస్ట్ కామనర్స్ అంటూ ఇమ్మాన్యుయల్ తో చెప్తూ తెగ బాధపడుతున్నాడు మనీష్. ఇది కాస్త ఓవరాక్షన్ అనే విధంగా అతను చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక అసలు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రీతూ చౌదరిని మర్యాద మనీష్ నామినేట్ చేశాడు. తను గిన్నెలు సరిగ్గా తోమడం లేదని పాయింట్ చెప్పాడు. అది వ్యాలిడ్ పాయింట్ కాదని నేను తోమినా.. ఎవరు నాకు క్లీన్ గా లేదని చెప్పలేదంటూ తను స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుంది. గుండు హరీష్ ని తనూజ నామినేట్ చేసింది. తనని నువ్వు అంటూ సంభోధించాడని, బిహేవియర్ గురించి మాట్లాడాడని, తను హర్ట్ అయిందని చెప్తూ తనూజ నామినేట్ చేసింది. ఇక ఫ్లోరా సైనీ షాంప్ అలా చేయడం కరెక్ట్ కాదని, సంజనని అలా మాటలు అనకూడదని తనని తనూజ నామినేట్ చేసింది. ఇక మర్యాద మనీష్ అయితే భరణిని టార్గెట్ చేశాడు. వీరిద్దరి మధ్య గొడవ గట్టిగానే జరిగింది.
ఈ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లను చూస్తే.. పద్నాలుగు మందిలో దాదాపు ఎనిమిది మంది నామినేట్ అయ్యారని తెలుస్తోంది. హరీష్, భరణి, మనీష్, ప్రియ, పవన్, ఫ్లోరా సైనీ కూడా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈసారి సామాన్యుల నుంచి నలుగురు, సెలబ్రిటీల నుంచి ఇద్దరు నామినేట్ అయ్యారన్నమాట.. మరి ఈ లిస్టులో నుంచి ఎక్కువగా మనీష్ లేదా హరీష్ బయటికి వెళ్లే అవకాశం ఉన్నట్టు బిగ్ బాస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్, భరణిలని ఆడవాళ్ళు అని అన్న మాస్క్ మ్యాన్ హరీష్.. సారీ కూడా చెప్పకపోవడంతో.. వీడికి ఇంత బలుపేంట్రా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రతీ బిగ్ బాస్ ప్రోమో కింద మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈవారం ఎవరు హౌస్ నుంచి పెట్టే సర్దుకుని వెళ్తారో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.
![]() |
![]() |