![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -337 లో.. కృష్ణ భర్త ఎవరు? ఎక్కడ ఉంటారని ఎవరిని అడిగిన చెప్పడం లేదని మురారికి కోపం వచ్చి అందరితో ఎవరు చెప్పకండి. నేనే ఆ కృష్ణ దగ్గరికి వెళ్లి అడుగుతానని అనగానే.. కృష్ణ ఎక్కడ నిజం చెప్తుందోనని ముకుంద టెన్షన్ పడుతు నేను వస్తానని అంటుంది. అవసరం లేదంటూ మురారి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత మురారి అలా కృష్ణ దగ్గరికి వెళ్లడంతో మధు హ్యాపీగా ఫీల్ అవుతు.. ఇది కదా కావలిసింది అటూ ముకుందకి కోపం వచ్చేలా మాట్లాడుతాడు. మరొకవైపు పెద్ద అత్తయ్య నన్ను దూరం పెడుతున్నారు. ఒక్క నిమిషం నా గురించి అలోచిస్తే బాగుండు అని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. పెళ్లి అయ్యిన అమ్మాయితో ఇలా వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయిన పెద్దమ్మ నేను కృష్ణకి దూరంగా ఉండడానికి అబద్ధం చెప్పిందేమోనని మురారి ఇబ్బంది పడుతూనే కృష్ణ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత కృష్ణ మెడలో తాళి చూసిన మురారి.. పెద్దమ్మ అబద్దం చెప్పలేదు. అసలు ఇన్ని రోజులు ఆ తాళిని నేనెందుకు గమనించలేదు. గమనిస్తే ఇక్కడి వరకు వచ్చేది కాదని మురారి అనుకుంటాడు. నా మెడలో తాళి చూసి సర్ మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత మీ భర్త ఎక్కడ అని కృష్ణని మురారి అడుగుతాడు. కృష్ణ చాలా తెలివిగా సమాధానం చెప్తుంది. నా భర్త ఎవరో మీక్కూడా తెలుసు. మీకు గతం గుర్తుకు వస్తే నా భర్త ఎవరో తెలుస్తుంది. మరొకవైపు లోపల ఉన్న శకుంతల.. ఇప్పటికి అయిన నిజం చెప్పు అని అనుకుంటుంది. కృష్ణ అలా అనగానే నాకు గతం గుర్తుకు వస్తే.. మీ భర్త ఎవరో తెలియడమేంటని మురారి ఆశ్చర్యపోతాడు. మీరు గతం గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి. ఒక డాక్టర్ గా చెప్తున్నానని కృష్ణ అంటుంది. అంతే కాకుండా నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళను ఇంకా నా భర్తకి నాకు ఎలాంటి విబేధాలు లేవని మురారికి క్లూ కూడా ఇస్తుంది కృష్ణ. ఇక ఆ తర్వాత మురారి ఆలోచనలో పడతాడు.
మరుసటిరోజు ఉదయం ఒకవైపు కృష్ణ మరొక వైపు ముకుంద, మురారి తులసి పూజ చేస్తుంటారు. మురారిని కృష్ణ చూస్తు పూజ చేస్తుంటుంది. అలాగే మురారి పక్కన ముకుంద ఉన్న పట్టించుకోకుండా కృష్ణ వంకే చూస్తుంటాడు. తరువాయి భాగంలో.. కృష్ణ దగ్గరికి మురారి ఆపిల్ ముక్కలు, చట్నీ తీసుకోని వస్తాడు. అది చూసిన కృష్ణ.. ఏసీపీ సర్ కి గతం గుర్తుకు వస్తుందని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |