![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -484 లో.....శివన్నారాయణ, పారిజాతం ఇద్దరిని కార్తీక్ గుడికి తీసుకొని వెళ్లి రిటర్న్ అవుతాడు. మీ నాన్న ఇంట్లో దాస్ ఉన్నాడట అక్కడ ఆపమని కార్తీక్ తో పారిజాతం చెప్తుంది. ఏంటి మీ గుసగుసలు అని శివన్నారాయణ అడుగుతాడు. ఏం లేదు వాళ్ళ కొడుకు ఊరు నుండి వచ్చాడట ఒకసారి శ్రీధర్ ఇంటి దగ్గర ఆపమని అంటుందని కార్తీక్ చెప్తాడు.
ఆ మాత్రం దానికి గుసగుసలు ఎందుకు మాములుగా మాట్లాడుకోవచ్చు కదా శ్రీధర్ ఇంటిదగ్గర ఆపు అని కార్తీక్ కి శివన్నారాయణ చెప్తాడు. కార్తీక్ సడన్ గా కార్ ఆపుతాడు. ఇంకా శ్రీధర్ ఇల్లు రాలేదు కదా అని శివన్నారాయణ అంటాడు. ముందు చూడండి దాస్ మావయ్య జ్యోత్స్న మాట్లాడుకుంటున్నారని కార్తీక్ చూపిస్తాడు. దాస్ ని రిక్వెస్ట్ చేస్తూ దాస్ చెయ్ తన తలపై పెట్టుకొని ఒట్టేస్తుంది జ్యోత్స్న. ఇక్కడ ఏం జరుగుతుందని శివన్నారాయణ వెళ్లి అడుగుతాడు. దాస్ దగ్గర ఏం మాట తీసుకున్నావని శివన్నారాయణ అడుగుతాడు. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.ఏం లేదు సర్ కాశీకి సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి లేదంటే నా మీద ఒట్టే అంటుందని దాస్ కవర్ చేస్తాడు. అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్లి దాస్, జ్యోత్స్న మాట్లాడుకున్నది చెప్తాడు. కాసేపటి తర్వాత కార్తీక్, దీప ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు. ఒకరికొకరు నుదుటిపై ముద్దు పెట్టుకుంటారు.
మరుసటి రోజు దాస్ తో జ్యోత్స్న మాట్లాడడం గురించి దశరథ్ తో శివన్నారాయణ చెప్తాడు. అసలు దాస్ నాకు అబద్ధం చెప్పాడనిపిస్తుందని శివన్నారాయణ అంటాడు. దాంతో దాస్ ని జ్యోత్స్న కొట్టిన విషయం గుర్తుచేసుకుంటాడు దశరథ్. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్ లో రెస్టారెంట్ లాభాల కోసం నేనొక నిర్ణయం తీసుకున్నానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |