![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -471 లో...... నేను దీపని క్షమించాలంటే ఒక కండిషన్ ఉంది.. తను జ్యోత్స్నని చంపబోతుంటే ఆ బుల్లెట్ నా భర్తకి తగిలిందని ఒప్పుకోవాలని సుమిత్ర అనగానే అలా ఎలా ఒప్పుకుంటుందని కార్తీక్ అంటాడు. ఒప్పుకుంటానని దీప అంటుంది. చెయ్యని తప్పుని ఎందుకు ఒప్పుకుంటావని దీపతో కార్తీక్ అంటాడు.
నువ్వు తప్పు చేసావ్ అది ఒప్పుకోమ్మంటున్నా.. నేను తప్పు చేసాను ఒప్పుకున్నా.. దీప ఒప్పుకోకుంటే మాత్రం నేను క్షమించనని సుమిత్ర తన నిర్ణయం చెప్తుంది. దీప తప్పు చేయలేదని కోర్ట్ నమ్మింది.. మావయ్యకి తగిలిన బుల్లెట్ దీప పట్టుకుని గన్ లో నుండి రాలేదని కోర్ట్ చెప్పిందని కార్తీక్ అంటాడు. నా దృష్టిలో దీప ఎప్పుడు దోషినే అని సుమిత్ర అనగానే దీప బాధపడుతుంది. ఇక ఒప్పుకుంటే వెళ్లిపోండి అని సుమిత్ర అంటుంది.
ఆ తర్వాత కార్తీక్ వాళ్ళు ఇంటికి వస్తారు. ఎందుకు బావ నేను ఒప్పుకుంటే రెండు కుటుంబాలు కలిసేవి కదా అని కార్తీక్ తో దీప అంటుంది. శ్రీధర్ కూడా అదే మాట అంటాడు. ఇప్పుడు దీప ఒప్పుకుంటే కోర్ట్ లో కేసు ఇంకా నడుస్తుంది. దీప ఒప్పుకున్న మాటలని సాక్ష్యాలుగా చేస్తారు ఆ జ్యోత్స్న వాళ్ళు.. అప్పుడు దీపకి శిక్ష పడుతుందని కార్తీక్ అంటాడు. అమ్మ నువ్వు దీప తప్పు చేసిందని నమ్ముతున్నావా అని కార్తీక్ అడుగగా లేదని కాంచన అంటుంది నేను మౌనంగా ఉండడానికి కారణం మా వదిన ఎంత దెబ్బ కొట్టింది రా అని కాంచన ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |