![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -470 లో.... సుమిత్ర కాంచన కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. భోజనానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. శ్రీధర్ పదా భోజనం చేద్దామని శివన్నారాయణ అనగానే శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అన్నయ్య నీకోసం నేను పాలకోవా చేశానని కాంచన అంటుంది. మీ వదిన దీపని క్షమించానని చెప్పాక.. అప్పుడే తినిపించమని దశరథ్ అంటాడు.
ఆ తర్వాత దీపకి సుమిత్ర ప్రేమగా భోజనం వడ్డిస్తుంది. ఏంటి ఇదంతా అని జ్యోత్స్న అనుకుంటుంది సుమిత్రని జ్యోత్స్న పక్కకి తీసుకొని వెళ్తుంది. మమ్మీ నువ్వు దీప ని క్షమించావా అడుగుతుంది. క్షమించాలి ఒక నెగటివ్ నే కాకుండా పాజిటివ్ కూడా చూస్తే ఆ మనిషి నచ్చేస్తారని సుమిత్ర అనగానే ఉన్న ఒక ఛాన్స్ కూడా మా మమ్మీ మిస్ చేసిందని జ్యోత్స్న డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న దేవుడి దగ్గర హారతి తీసుకొనిరా అనీ సుమిత్ర చెప్పగానే.. జ్యోత్స్న తీసుకొని వస్తుంది. దీపకి సుమిత్ర హారతి ఇచ్చి క్షమిస్తుంది.
దాంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఒక నా కోరిక తీరుస్తావా అని దీపని సుమిత్ర అడుగుతుంది. ఏంటని దీప అడుగుతుంది. నా కూతురు జ్యోత్స్నని చంపాలని ట్రై చేస్తుంటే నా భర్తకి బుల్లెట్ దిగిందని ఒప్పుకోవాలని సుమిత్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఏం ట్విస్ట్ ఇచ్చావ్ మమ్మీ అని జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఎలా ఒప్పుకుంటుందని కార్తీక్ అంటాడు. ఒప్పుకుంటున్నానని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |