![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -464 లో..... మేమ్ ఇంటికి త్వరగా వెళ్ళాలని శివన్నారాయణతో కార్తీక్ అంటాడు. ఎందుకని అని శివన్నారాయణ అడుగగా.. చిన్నపని ఉందని కార్తీక్ చెప్తాడు. శౌర్య నిన్ను ఒక ప్రశ్న అడుగుతానని డ్రాయింగ్ పేపర్ చూపిస్తూ ఈ కేక్ కట్ చేస్తున్న పాప ఎవరని శివన్నారాయణ అడుగుతాడు. నేనే అని చెప్పబోతు శౌర్య ఆగిపోతుంది. బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొని వచ్చారు. ఈ రోజు నీ బర్త్ డే అని నాకు తెలుసు.. నువ్వు వెళ్లి బయట ఆడుకోమని శౌర్యని శివన్నారాయణ బయటకు పంపిస్తాడు.
ఆ తర్వాత ఈ రోజు శౌర్య బర్త్ డే అని మాకు ఎందుకు చెప్పలేదు.. ఎలాగూ మీ దృష్టిలో మేమ్ చెడ్డవాళ్ళమే.. ఇప్పుడు శౌర్య దృష్టిలో కూడా మమ్మల్ని చెడ్డవాళ్ళని చెయ్యాలి అనుకుంటున్నారా అని కార్తీక్ పై శివన్నారాయణ కోప్పడతాడు. కోపం దీప మీద.. పాప మీద కాదు.. ఇప్పుడు దాన్ని కూడా దూరం చేయాలి అనుకుంటున్నారా అని దీపని సుమిత్ర కోప్పడుతుంది. ఇప్పటికే పాపని అడ్డుపెట్టుకొని కుటుంబానికి దగ్గర అవుతున్నానంటున్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్తే కావాలనే చేస్తుందని అంటారని దీప అంటుంది. ఇక మేమ్ వెళ్ళొస్తామని కార్తీక్ అనగానే వెళ్ళండి మీకు నచ్చింది చేసుకోండి అని శివన్నారాయణ కోప్పడతాడు.ఆ తర్వాత శ్రీధర్ భోజనం చెయ్యడానికి వస్తాడు. పక్కన స్వప్న కూర్చుంటుంది. తను అన్న మాటలకి శ్రీధర్ తో మాట్లాడలేకపోతుంది.. గిల్టీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు కార్తీక్, దీప ఇద్దరు శౌర్యని తీసుకొని ఇంటికి వస్తారు. కేక్ కటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేసానని అనసూయ అంటుంది. అందరు లోపలికి వెళ్ళాక కాశీ యాక్సిడెంట్ చేసిన విషయం, శ్రీధర్ హెల్ప్ చేసిన విషయం కార్తీక్ కి కాంచన చెప్పగానే ఇప్పుడే వస్తానని కార్తీక్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీధర్ ని కార్తీక్ కలుస్తాడు. నాకు ఎందుకు ఈ విషయం చెప్పనివ్వలేదని శ్రీధర్ ని కార్తీక్ అడుగగా నా కూతురికి కష్టం వస్తే అన్నయ్య ఉన్నాడు అనే దానికంటే నాన్న ఉన్నాడని తను అనుకోవాలి.. ఆ బాధ్యత తీసుకున్నాను.. ఏం చేసినా నా కొడుకు, కూతురు కోసమే.. మీరంటే చాలా ఇష్టంరా.. నువ్వు మరమన్నావ్ కదా.. మారానని శ్రీధర్ ఎమోషనల్ గా మాట్లాడుతుంటాడు. చాలా రోజులకి నువ్వు నాకు నచ్చావని తండ్రి భుజాలపై కార్తీక్ వాలిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |