![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -452 లో.....తాళి నువ్వే తీసావని పారిజాతంపై స్వప్న నింద వెయ్యడంతో నేను కాదని పారిజాతం అంటుంది. ఆ తాళి తీసింది ఎవరో నాకు తెలుసని పారిజాతం అంటుంది. ఎవరని దీప అడుగగా.. నీ భర్తని అడుగమని పారిజాతం అంటుంది. అందరు పారిజాతాన్ని అడుగగా సుమిత్ర అని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. మీరు అబద్ధం చెప్తున్నారు.. అలా ఎప్పుడు మా వదిన చెయ్యదని కాంచన అంటుంది.
ఆ తర్వాత పారిజాతం కార్తీక్ చెయ్ పట్టుకొని కాంచన తల మీద చెయ్ పెట్టి.. ఇప్పుడు చెప్పురా నేను చెప్పింది అబద్ధమని అని పారిజాతం అనగానే కార్తీక్ సైలెంట్ గా ఉంటాడు. వాడు చెప్పడు.. ఎందుకంటే అదే నిజం కాబట్టి నేనే ఆ తాళిని తీసానని సుమిత్ర అనగానే అందరు షాక్ అవుతారు. నాకు ఈ దీప ఎప్పటికి శత్రువే అని సుమిత్ర అంటుంది. అన్నయ్య మీరు అందరు కలిసి ఈ పని చేశారని కాంచన ఎమోషనల్ అవుతుంది. నాన్న నువ్వు కూడా కదా అని కాంచన అనగానే అలా అయితే నేనే ఎందుకు మీ అమ్మ తాళి తీసుకొని వచ్చి ఇస్తానని శివన్నారాయణ అంటాడు. అది నిజమేనని కాంచన అంటుంది. ఆ తర్వాత అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సుమిత్ర మాటలకు దీప ఏడుస్తుంది.
ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు ఇంటికి వచ్చి మాట్లాడుకుంటారు. అదంతా నా వల్లే జరిగిందని పారిజాతం అనుకుంటుంది కానీ అన్నింటికి సూత్రదారి జ్యోత్స్న.. నేను తియ్యమంటేనే మమ్మీ ఆ తాళి తీసిందని సుమిత్రని జ్యోత్స్న ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసిన విషయం చెప్తుంది. నువ్వు బావ మమ్మీ మాటలు వినేలా చేసింది కూడా నేనేనని జ్యోత్స్న చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. ఏం మైండ్ గేమ్ అని జ్యోత్స్నని పారిజాతం పొగుడుతుంది. ఆ తర్వాత సుమిత్ర చేసిన దానికి కాంచన బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |