![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -343 లో.. శౌర్య తన చేతిలో లెటర్ పట్టుకొని దీపని కలవడానికి వెళ్తుంది. ఇంట్లో శౌర్య ఎక్కడ కనిపించకపోవడంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. బయటకు వెళ్లి వెతుకుతుంటే శౌర్య కనిపిస్తుంది. వెంటనే తనపై కోప్పడి కార్తీక్ ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళావంటూ కాంచన, అనసూయ అడుగుతారు. అమ్మని కలవడానికి స్టేషన్ కి వెళ్ళాను.. అమ్మ ఎప్పుడు రాదని జ్యోత్స్న చెప్పింది. ఈ లెటర్ చదివితే అమ్మ నా కోసం తప్పకుండా వస్తుందని వెళ్ళానని శౌర్య చెప్తుంటే.. అందరు ఎమోషనల్ అవుతారు.
అమ్మ తప్పకుండా వస్తుంది నేను తీసుకొని వస్తానని శౌర్యకి నచ్చజెప్పుతాడు కార్తీక్. దాంతో శౌర్య కూల్ అయి లోపలికి వెళ్తుంది. ఎప్పుడు ఈ జ్యోత్స్న ఇలాగానే చేస్తుందని కార్తీక్ కోప్పడతాడు. అసలు దీపకి ఇంకా శత్రువులు ఎవరు ఉండి ఉంటారని కార్తీక్ అంటుంటే.. ఇంకెవరు ఆ గౌతమ్ గాడు.. ఇంటికి వచ్చి మరి వార్నింగ్ ఇచ్చాడని కాంచన, అనసూయ చెప్తుంటే కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి గౌతమ్ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడా మరి నాకెందుకు చెప్పలేదని కాంచన, అనసూయలపై కార్తీక్ కోప్పడతాడు. ఇక అనసూయ జరిగింది మొత్తం చెప్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఎవరు ఇదంతా చేసారోనని కార్తీక్ అనుకుంటాడు.
సీన్ కట్ చేస్తే గౌతమ్ ని కార్తిక్ కలుస్తాడు. కాలర్ పట్టుకొని మరి నీలదీస్తాడు. ఆ గన్ పేల్చిచింది నువ్వే కదా అని కార్తీక్ అడుగుతాడు. నీ భార్య షూట్ చేస్తే నన్ను అంటావేంటని గౌతమ్ అంటాడు. నీ భార్య లాగే నువ్వు మా పెళ్లి ఆపాలనుకుంటున్నావా అని గౌతమ్ అంటాడు. అసలు నువ్వు మగాడివి అయితే నీ భార్యని విడిపించుకో అంతే గానీ ఇలా నన్ను అనకు అని గౌతమ్ చెప్పి వెళ్ళిపోతాడు. గౌతమ్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే నిజంగానే గౌతమ్ కి తెలియదా ఎవరై ఉంటారని కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |