![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -332 లో..... కార్తీక్ ఇంటికి వెళ్లి జరిగింది మొత్తం కాంచన, అనసూయలకి చెప్పగానే.. వాళ్ళు షాక్ అవుతారు. ఈ విషయం శౌర్యకి తెలియకుండా జాగ్రత్తపడండి అని కార్తీక్ చెప్తాడు. మా అన్నయ్యని షూట్ చెయ్యడమేంటి నేను వెంటనే మా అన్నయ్యని చూడాలని కాంచన ఏడుస్తుంటే.. ఇప్పుడు ఎక్కడికి వద్దు నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు హాస్పిటల్ నుండి వస్తున్న అందరి చేత తిట్లు తినే వస్తున్నానని కార్తీక్ చెప్తాడు.
ఆ తర్వాత డాక్టర్ బయటకు వస్తాడు. మా డాడ్ కి ఎలా ఉంది అని జ్యోత్స్న అడుగుతుంది. తాను స్పృహలోకి వస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్ అంటాడు. డాక్టర్ శివన్నారాయణని పక్కకి పిలిచి దశరథ్ బ్రతకడం చాలా కష్టమని డాక్టర్ చెప్పగానే శివన్నారాయణ మనసు ముక్కలవుతుంది. మరొకవైపు దశరత్ గురించి దీప ఆలోచిస్తుంటుంది. అప్పుడే కానిస్టేబుల్ వచ్చి నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావా అని అంటుంది. లేదు హాస్పటల్ లో ఉన్న దశరథ్ గురించి అని దీప అంటుంది. ఎందుకు ఉన్నాడో పోయాడో అనా అని ఇన్‌స్పెక్టర్ అంటాడు.గన్ ఎలా పేలిందో తర్వాత తెలుస్తుంది కానీ దశరథ్ గారు బాగుండాలని దీప అనుకుంటుంది.
మరొకవైపు నేను బయటకు వెళ్తున్నానని కాంచన, అనసూయలకి చెప్తాడు కార్తీక్. స్కూల్ కి రెడీ అయి శౌర్య ఉంటుంది. ఎక్కడికి అని కార్తీక్ ని శౌర్య అడుగగా.. ఏదో డైవర్ట్ చేస్తాడు కార్తీక్. ఆ తర్వాత సుమిత్ర బాధపడుతుంటే.. నువ్వు ఇంటికి వెళ్ళమని జ్యోత్స్న అంటుంది. వెళ్ళనని సుమిత్ర అంటుంది. అప్పుడే ఇన్‌స్పెక్టర్ శివన్నారాయణ కి ఫోన్ చేసి స్టేషన్ కి రమ్మని చెప్తాడు. దీపకి బావ బెయిల్ కోసం తిరుగుతున్నాడు కావచ్చని జ్యోత్స్న అనగానే.. దీప బయటకు రాకూడదని సుమిత్ర అంటుంది. ఇది దెబ్బతిన్న ఆడదాని కోపమంటే అని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |