![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -280 లో.....కాంచన, దీపలు కావేరికి కృతజ్ఞతలు చెప్పాడానికి తన ఇంటికి వెళ్తారు. నిన్ను నా ప్రవర్తనతో బాధపెట్టాను కానీ నువ్వు నా మనవరాలి ప్రాణం కాపాడవని కావేరికి కాంచన థాంక్స్ చెప్తుంది. దాంతో కావేరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి శౌర్యని తీసుకొని వస్తాడు కార్తీక్. తాతయ్య చిన్న నానమ్మ అంటు కావేరి దగ్గరికి శౌర్య వస్తుంది. నాకు మీరు ఏదో హెల్ప్ చేశారు అంట కదా నాన్న థాంక్స్ చెప్పన్నాడని శౌర్య అంటుంది.
నేను కొంచెం వీళ్ళతో మాట్లాడాలని శౌర్యని తీసుకొని కాంచన, దీప లని కార్తీక్ వెళ్ళమని చెప్తాడు. దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు కానీ కార్తీక్ ఏం మాట్లాడతాడో అని దీప బయట ఉండి చూస్తూ ఉంటుంది. మీరు నా కూతురు ప్రాణం కాపాడారు.. మీరు చేసిన సాయాన్ని మరొకరిది అని చెప్తున్నారు.. అలాంటి వాళ్ళని దరిద్రలు అంటారు అని ఇండైరెక్ట్ గా శ్రీధర్ ని అంటాడు. మిమ్మల్ని ఎప్పుడు ప్రేమగా పలకరించేలేదు కానీ అందరి కంటే ఎక్కువ నా బాధ ని అర్థం చేసుకున్నారని థాంక్స్ చెప్తాడు. ఇది మీ దగ్గర నేను నలభై అయిదు లక్షలు అప్పు తీసుకున్న అని నోట్.. ఇది తీసుకోండి అని కార్తీక్ ఇస్తుంటే నాకూ వద్దు నేను అప్పు ఇవ్వలేదని కావేరి అంటుంది. మా అమ్మపై ఏ మాత్రం అభిమానం ఉన్నా తీసుకోండి అని కార్తీక్ తన చేతిలో పెడతాడు సంవత్సరం లోపు మీకు అప్పు చెల్లిస్తానని శ్రీధర్ కి చెప్పి కార్తీక్ వెళ్తాడు. దాంతో నువ్వే వాళ్ళని నా వాళ్ళు అనుకుంటున్నావు.. వాళ్ళు కాదు అనుకుంటే పిన్ని అని పిలిచే వాడు కదా అని శ్రీధర్ అంటాడు. మళ్ళీ కార్తీక్ వచ్చి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను.. నా కూతురు చిన్న నాన్నమ్మ ఎప్పుడు మన ఇంటికి వస్తుందని, మీరు ఎప్పుడు అయినా మన ఇంటికి వచ్చి వెళ్లొచ్చు చిన్నమ్మ అని కార్తీక్ అంటాడు. నీ కూతురు ఇంటికి వెళ్లినట్లు నీ కొడుకు ఇంటికి రావచ్చు.. ఉంటాను చిన్నమ్మ అనగానే కావేరి మొహం వెలిగిపోతుంది. శ్రీధర్ మొహం మాడిపోతుంది. అదంతా చూస్తున్న దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తీక్ వెళ్ళిపోతాడు. అంటే మీరందరు ఒకటే.. నేను ఒక్కడినే వేరే అని శ్రీధర్ కోపంగా అనుకుంటాడు.
ఆ తర్వాత కార్తీక్ దీప ఇంటికి వెళ్తారు. నువ్వు వస్తావని అనుకోలేదు రా అని కాంచన అనగానే.. నీ కొడుకిని కదమ్మా నాకు కృతజ్ఞతలు చెప్పాలనిపించింది.. శౌర్య విషయం చెప్తే దీప ఎలా బాధపడుతుందని దీపకి నేను చెప్పాకుండా దాచానో, తను కూడా డబ్బు ఎవరిచ్చారో చెప్తే నేను బాధపడుతానని చెప్పలేదని కార్తీక్ అంటాడు. దీపని అర్ధం చేసుకుంటాడు. నోట్ రాసిచ్చానన్నావ్ అంత డబ్బు ఎలా కడతావని కాంచన అనగానే.. కడతారు, తాతయ్యకి ఇచ్చిన మాట కాదు.. తండ్రికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటారని దీప చెప్తుంది. అందరికి నా గెలుపుతోనే సమాధానం చెప్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |