![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -739 లో...... సూరజ్ ఫ్యామిలీ గురించి కనుక్కోవడానికి తనని దీప క్యాబిన్ కి కార్తీక్ తీసుకొని వెళ్తాడు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని జ్యోత్స్న చాటుగా వింటుంది. బ్రో నువ్వు నీ ఫ్యామిలీ గురించి చెప్పమని కార్తీక్ అనగానే ఏంటి బ్రో నువ్వు ఏదో సంబంధం మాట్లాడానికి వచ్చినట్లు అడుగుతున్నావ్.. అదే అనుకో వీధిలో ఒక మంచి అమ్మాయిని చూసానని కార్తీక్ అంటాడు. నీ మనసు లో ఎవరైనా ఉన్నారా చెప్పు అని కార్తీక్ అడుగుతాడు. ఇక్కడ ఎవరు లేరు సూరజ్ చెప్పమని దీప అనగానే జ్యోత్స్న అని సూరజ్ అంటాడు.
ఆ మాట విని నీకు ఎంత దైర్యం ఉంటే నా పేరు చెప్తావని జ్యోత్స్న వచ్చి తన కాలర్ పట్టుకొని అడుగుతుంది. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడ ఎవరు లేరని దీప గారు అంటే అక్కడ జ్యోత్స్న ఉందని చెప్తున్నానని సూరజ్ అంటాడు. నీ సంగతి ఇలా కాదురా అని శివన్నారాయణ దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. ఇంకా సూరజ్ గాడిని పంపించకుండా ఏం చేస్తున్నారని అడుగుతుంది. త్వరలోనే పంపిస్తానని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత అందరు మధ్యాహ్నం భోజనం చేస్తుంటే సూరజ్ వచ్చి సర్ అర్జెంట్ గా అయిదు లక్షలు కావాలని అంటాడు. ఇవ్వడం కుదరదని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ నువ్వు వెళ్లి మేనేజర్ కి చెప్పి అయిదు లక్షలు ఇవ్వమని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ ని శివన్నారాయణ ఆపి నువ్వు అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో అవ్వమని కార్తీక్ కి మెల్లగా చెప్తాడు. సూరజ్ డబ్బు తీసుకొని హాస్పిటల్ లో కట్టి పెద్దాయనతో మాట్లాడతాడు. అది కార్తీక్ చూసి శివన్నారాయణకి ఫోన్ చేసి చెప్తాడు. సూరజ్ వెళ్ళాక ఆ పెద్దాయన దగ్గరికి కార్తీక్, శివన్నారాయణ వచ్చి సూరజ్ గురించి అడుగుతారు. సూరజ్ చాలా మంచివాడు.. అతను అనాధ.. తనని నేనే పెంచానని సూరజ్ గురించి మంచిగా చెప్తాడు.
మరొకవైపు అసలు ఏం జరుగుతుంది గ్రానీ అని పారిజాతంకి జ్యోత్స్న ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత హాల్లోకి శివన్నారాయణ అందరిని పిలుస్తాడు. సూరజ్ ఒక అనాధ అంట అని చెప్పగానే సుమిత్ర షాక్ అవుతుంది. గెంటేయడానికి అనాధ అయితే ఏంటని జ్యోత్స్న అనగానే జ్యోత్స్నకి సూరజ్ కి పెళ్లి చెయ్యాలని మేం నిర్ణయం తీసుకున్నామని సుమిత్ర అంటుంది. దాంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |