![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -744 లో.... జ్యోత్స్న అంటే నాకు ఇష్టం కానీ జ్యోత్స్న మనసులో నేను.. నా మనసులో జ్యోత్స్న.... జ్యోత్స్న మనసు లో కార్తీక్ ఉంటే మేం ఎలా కలిసి ఉండగలం.. అందుకే నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోమని అడిగిన మీ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తున్నానని సూరజ్ చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్నకి తన మనసులో కార్తీక్ లేడని నాకు అనిపించినప్పడు నేనే తన మెడలో తాళి కడతానని సూరజ్ చెప్తాడు. సూరజ్ వెళ్ళిపోతుంటే నువ్వు ఇక్కడే అవుట్ హౌస్ లో ఉండమని సుమిత్ర అంటుంది. నేను ఉండనని సూరజ్ అనగానే నువ్వు తప్పు చేసావ్ అనుకుంటే వెళ్ళిపో లేదంటే అవుట్ హౌస్ లో ఉండమని సుమిత్ర చెప్పగానే సరే అంటాడు.
దీప, కార్తీక్ బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. సూరజ్ పై ఉన్న డౌట్ క్లియర్ అయిందా బావ ఈ ఆఫర్ కి వేరే వాళ్ళు అయితే ఎగిరి గేంతేసే వాళ్ళు అలా చెయ్యలేదంటే సూరజ్ మంచోడు అని అర్థమని కార్తీక్ తో దీప అంటుంది. మరొకవైపు ఎందుకు సూరజ్ ని అవుట్ హౌస్ లో ఉండమన్నావ్ జ్యోత్స్నకి వేరే సంబంధం చూసేవాళ్ళం కదా అని సుమిత్రని శివన్నారాయణ అడుగుతాడు. ఎవరిని చూసినా కార్తీక్ గురించి తెలిస్తే ఇలాగే ఉంటుంది కదా జ్యోత్స్న గురించి సూరజ్ కరెక్ట్ గా చెప్పానని సుమిత్ర చెప్తుంది. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్తుంది. వాడు నిన్ను రిజెక్ట్ చేస్తాడా.. ఎంత ధైర్యం అని పారిజాతం అంటుంది. వాడు చెప్పింది అన్ని నిజమే గ్రానీ బంగారం అన్నాడు.. ప్రేమించమని వెంటపడ్డాడు.. తీరా పెళ్లి అనేసరికి నా మనసుని అందరి ముందు పెట్టాడు.. వాడు నన్ను పెళ్లి చేసుకోవాలంటే వాడిపై నాకు ప్రేమ ఉందని నమ్మించాలట గ్రానీ అని జ్యోత్స్న ఏడుస్తుంది.
ఏంటే జ్యోత్స్న నువ్వు ఏడుస్తున్నావని పారిజాతం అంటుంది. వాడు నన్ను రిజెక్ట్ చేసాడు గ్రాని అని జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంటే ఏంటే కొత్తగా కన్పిస్తున్నావ్.. వాడిని కావాలనే నువ్వు నీ వెంట తిప్పించుకొని.. ఇప్పుడు వాడు రిజెక్ట్ చేస్తే బాధపడినట్లు ఉంది.. కొంపదీసి సూరజ్ తో ప్రేమలో ఉన్నావా అని పారిజాతం అంటుంది. గ్రానీ నన్ను వదిలేయ్ కాసేపు అని జ్యోత్స్న ఏడుస్తుంది. మరొకవైపు ఆ జ్యోత్స్న అసలు సూరజ్ తో పెళ్లికి అంటే ఒప్పుకోదు పైగా సూరజ్ చెప్పినట్లు అసలు చెయ్యదని కార్తీక్ వాళ్ళతో కాంచన అంటుంది. నాకు ఇప్పటికి సూరజ్ పైన డౌట్ ఉంది.. ఎక్కడ ఒక దగ్గర పని చేయనివాడు ఇక్కడే ఉంటున్నాడంటే వాడిని ఏదో శక్తి ఆపుతుంది.. అది జ్యోత్స్న అని అర్ధం అయిందని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |