![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -78 లో.. దీప దగ్గరకు వెళ్లిన నర్సింహ.. శౌర్యని తనకి ఇచ్చేస్తే జీవితంలో తన ముఖం చూపించని అంటాడు. నీకు నచ్చినట్టు బతకొచ్చు.. నీ గురించి తప్పుగా మాట్లాడను.. ఇందులో బలవంతం ఏం లేదు.. నిజంగా పాప నాకే పడితే నాకు ఇచ్చేయ్.. నాకు పుట్టలేదంటావా? నీ దగ్గరే పెట్టుకో. నాకు వద్దు.. కానీ ఏదొక సమాధానం మాత్రం చెప్పు.. నువ్వు ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఆలోచించి నీ సమాధానం ఏంటో చెప్పు? నువ్వేంటో నువ్వే చెప్పుకున్నట్టవుతుంది.. ఆలోచించి నిర్ణయం తీసుకో.. ఇక మన మధ్య కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఉండకూడదు. మనిద్దరి జీవితాలకు నీ నిర్ణయమే ముగింపు.. నాకు పుట్టిన బిడ్డే అయితే దాన్ని నాకు ఇచ్చేయ్.. నాకు పుట్టలేదంటే నీతోనే ఉంచుకోమని నరసింహా అంటాడు. నర్సింహ మాటలకు కుమిలి కుమిలి ఏడ్చి అక్కడే కుప్పకూలిపోతుంది దీప. ఇక సుమిత్ర.. తన కూతురు జోత్స్నపై ప్రేమ కురిపిస్తుంటుంది. మరోవైపు శ్రీధర్ తెగ ఫీల్ అయిపోతుంటాడు. నా రెండో పెళ్లాన్ని వైజాగ్‌లో ఉండమంటే ఇక్కడికి తగలడ్డారు. ఇప్పుడు క్యాంప్‌ల పేరుతో తిరగలేక చస్తున్నానని బట్టలు సర్దేస్తుంటాడు.
ఇక కాంచనకి జ్వరం రావడంతో కార్తీక్ కంగారు పడుతుంటాడు. అది విని వచ్చిన శ్రీధర్.. ఏంటి కాంచన ఒళ్లు కాలిపోతుంటే నాకు చెప్పలేదేంటని అంటాడు. కార్తీక్ కారు తీయరా.. అమ్మని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్దాం. అది ఇది అని అంటాడు. అబ్బా.. నాకు వచ్చింది చిన్న జ్వరమే తగ్గిపోతుందని కాంచన అంటంది. ఇంతలో శ్రీధర్‌కి రెండో భార్య కావేరి ఫోన్ చేస్తుంటుంది. దాంతో శ్రీధర్.. సర్లే.. చిన్న జ్వరమే అంటుంది కదా.. ట్యాబ్లెట్స్ వేద్దాంలే అని అంటాడు. థాంక్స్ అండీ నన్ను అర్ధం చేసుకున్నందుకు అని కాంచన అంటే.. నిన్నెప్పుడూ అర్ధం చేసుకుంటూనే ఉంటాను శ్రీమతి గారూ అని శ్రీధర్ అంటాడు. ఇంతలో కార్తీక్.. ఏంటి నాన్నా.. నువ్వు బట్టలు సర్దుకుని బయల్దేరావని అడుగుతాడు. క్యాంప్‌కి వెళ్తున్నానురా.. అమ్మకి బాలేదు కదా.. మానేద్దాం అనుకుంటున్నానని అంటాడు శ్రీధర్.. ఎలాగూ కాంచన పంపిస్తుందనే నమ్మకంతో. చివరికి అదే అవుతుంది. మంచి నిర్ణయం తీసుకున్నావ్ నాన్నా అని కార్తీక్ అనడంతో.. ఏంట్రా మంచి నిర్ణయం. నాకు బాగానే ఉంది కదా.. అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు వెళ్లాలి కదా.. ఏవండీ మీరు వెళ్లండి అని కాంచన అనగానే.. శ్రీధర్ బయల్దేరి వెళ్తాడు.
మరోవైపు దీప రోడ్డుపై చూసుకోకుండా నడుచుకుంటు వస్తుంటుంది. ఇక దారిలో వెళ్తున్న కార్ అతను తనని చూసి ఆపి.. చూసుకోవాలి కదమ్మా అని అంటాడు. ఇక అప్పుడే కార్తిక్ వచ్చి వాడిని తిట్టి దీపకి సపోర్ట్ గా ఉంటాడు. ఆ తర్వాత మీ నాన్న చావుకి నేను కారణం కాదు.. మీ నాన్న రాంగ్ రూట్ లో వచ్చాడు. అప్పుడు ఆ కార్ కి మా ఫ్రెండ్ నడుపుతున్నాడని కార్తిక్ గతంలో జరిగినదంతా చెప్తాడు. చేయని తప్పుకి శిక్ష కూడా అనుభవించానని, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూసి, నా తప్పేం లేదని నన్ను వదిలేసారని కార్తిక్ మొత్తం చెప్తాడు. అదంతా విని తన తప్పు తెలుసుకొని దీప లోలోపల బాధపడుతుంది. నేను ఇంటికి వెళ్లాలని దీప అనడంతో.. నేనూ అటే వెళ్తున్నా, రండి డ్రాప్ చేస్తానని అంటాడు కార్తీక్. సరేనని కారు ఎక్కేస్తుంది దీప. ఇక కారులో వెళ్తూ కార్తీక్‌ని తను అపార్ధం చేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకుని దీప కుమిలికుమిలి ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |