![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -450 లో... దీప తాళి వంక జ్యోత్స్న కోపంగా చూస్తుంది. శివన్నారాయణ ఆ తాళి ఇచ్చిన సిచువేషన్ ని జ్యోత్స్న గుర్తుచేసుకుంటుంది. ఏంటి జ్యోత్స్న అలా చూస్తున్నావని దీప అడుగుతుంది. అదృష్టవంతురాలు అంటే నువ్వేనని జ్యోత్స్న అంటుంది. నా దృష్టిలో నువ్వే అదృష్టవంతురాలివి.. అమ్మ, నాన్న ఉన్నారని జ్యోత్స్నతో దీప అంటుంది. నీది అయిన వస్తువులు నేను దక్కించుకోవడమే నా లక్ష్యం అని జ్యోత్స్న అనుకుంటుంది.
ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి స్వప్న వచ్చి జ్యూస్ ఇస్తుంది. శ్రీధర్ ఎప్పటిలాగే స్వప్నతో ఏదో ఒకటి అని గొడవ పెట్టుకోవాలని ట్రై చేస్తాడు. అప్పుడే శివన్నారాయణ, దశరథ్ పూజ దగ్గరికి వస్తారు. వదిన ఎక్కడ అని కాంచన అడుగుతుంది.. రాలేదని దశరథ్ సమాధానం చెప్తాడు. దాస్ ని శివన్నారాయణ పిలిచి పక్కన కూర్చోమని అంటాడు. దాంతో శ్రీధర్ ఫీల్ అవుతాడు. అల్లుడికి మర్యాద ఇవ్వడం లేదు కానీ వాడిని పక్కన కూర్చొబెట్టుకుంటున్నాడని శ్రీధర్ అనుకుంటాడు.
అమ్మకి దీపపై ఎంత కోపం ఉందో మరొకసారి బయటపెట్టే ప్రయత్నం చేస్తానని జ్యోత్స్న అనుకుని కాంచన దగ్గరికి వెళ్తుంది. అత్తా.. నువ్వు అమ్మకి ఫోన్ చేసి రమ్మను అని జ్యోత్స్న అనగానే.. మాట్లాడేది అయితే వచ్చేది కదా అని కాంచన అంటుంది. అలా అయితే వాయిస్ మెసేజ్ పెట్టు అని జ్యోత్స్న చెప్పగానే సుమిత్రతో ఉన్న అనుబంధం గురించి కాంచన చెప్తూ ఎమోషనల్ అవుతూ వాయిస్ మెసేజ్ పంపుతుంది. అది సుమిత్ర విని బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |