![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -239 లో.....కార్తీక్ జాబ్ కోసం వెళ్తాడు బస్టాప్ లో వెయిట్ చేస్తుంటే.. జ్యోత్స్న చూస్తుంది. అక్కడికి వెళ్ళేలోపు కార్తీక్ ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక రెస్టారెంట్ కి ఇంటర్వ్యూకి వెళ్తాడు కార్తీక్. ఇక్కడ సీఈఓ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసిందని అంటాడు. మీరు జాబ్ కి రావడం ఏంటి? అయిన జాబ్ ఖాళీగా లేదని అంటాడు. ఆ తర్వాత చైర్మన్ కి ఫోన్ చేసి ఉందని అనగానే.. కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఫామ్ ఫీల్ చేస్తుంటాడు. అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి వద్దని చెప్పడంతో సారీ సర్ జాబ్ కి వేరే వాళ్లు సెలెక్ట్ అయ్యారట అని అంటాడు. దాంతో కార్తీక్ డిస్సపాయింట్ అవుతాడు.
ఆ తర్వాత కార్తీక్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతాడు. అందురు నో అని చెప్తారు. మరొకవైపు శౌర్యకి కాంచన భోజనం తినిపిస్తుంది. మనం మన ఇంటికి ఎప్పుడు వెళ్తామని శౌర్య అనగానే.. కొన్ని రోజులు అవుతుందని దీప అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు ఏదో జరిగుతుంది జాబ్ వస్తుందనుకున్న కానీ ఇలా జరిగిందంటూ కార్తీక్ నిరాశగా మాట్లాడతాడు.
ఆ తర్వాత కార్తీక్ టీ తాగుతుంటే.. ఎవరో ఫోన్ చేసి మీకు ఇప్పుడు జాబ్ కావాలి కదా అడ్రెస్ పంపిస్తున్నాను రమ్మని చెప్తారు. ఎవరో మీ గురించి తెలిసినా వాళ్లే వెళ్ళండి అని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్ వెళ్తాడు. తీరా చూస్తే అక్కడ శ్రీధర్ ఉంటాడు. నీకు జాబ్ కావాలి.. నేను ఇస్తానంటాడు. వద్దని కార్తీక్ తిరిగి వస్తుంటే.. నీకు జాబ్ రాదు దమ్ముంటే ఇరవై నాలుగు గంటల్లో జాబ్ తెచ్చుకోమని శ్రీధర్ అనగానే కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత దీప ఒక దగ్గరికి వంట మనిషిగా వెళ్తుంది. అక్కడికి సరుకులు తీసుకొని కార్తీక్ వస్తాడు. అతన్ని చూసి దీప షాక్ అవుతుంది. సరకులన్నీ కరెక్టే ఉన్నాయా చూడమని దీపతో ఆ ఓనర్ అంటుంది. కార్తీక్ చెప్తుంటే.. దీప చూస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |