![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -204 లో... దీపని జ్యోత్స్న కలుస్తుంది. నాకు నీ తాళి కావాలి ఎంతకి ఇస్తావంటూ బ్లాంక్ చేక్ ఇస్తుంది. దానికి నేను ఒప్పుకుంటున్నానని దీప అనగానే.. జ్యోత్స్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగానా ఎంత కావాలని అడుగుతుంది. అవును నాకు ఈ తాళిని అమ్ముకునే విషయంలో నాకు అంత అనుభవం లేదు. వెళ్లి మీ నానమ్మ దగ్గరికి వెళ్లి.. అమ్మ నువ్వు తాళి అమ్మితే ఎంత తీసుకుంటావని అడుగమని దీప అనగానే.. జ్యోత్స్న కోపంగా దీపపై అరుస్తుంది. దాంతో అరవకు చెప్పుతో కొడతాను.. ఇంకొక మాట మాట్లాడితే అని దీప వార్నింగ్ ఇస్తుంది.
నీకు తాళి విలువ తెలుసా.. దానికి నేను విలువ ఇస్తానని దీప అంటుంది. అలా జ్యోత్స్నకి నాలుగు చివాట్లు పెడుతుంది దీప. ఇక ఇలా ఫోన్ చేసి విసిగించకని వార్నింగ్ ఇచ్చి దీప వెళ్తుంది. మరొకవైపు జరిగింది శ్రీధర్ గుర్తు చేసుకుంటాడు. అప్పుడే కావేరి కాఫీ తీసుకొని వస్తుంది. దాంతో జరిగిన దానికి కావేరిపై శ్రీధర్ చిరాకు పడితే.. తెచ్చిన కాఫీ తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత కాశీ జరిగింది గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటే.. దాస్ వస్తాడు. అసలు జరిగిందేదో జరిగిపోయిందని అనుకోకుండా జ్యోత్స్న అక్క ఎందుకు ఇలా చేస్తోంది.. అక్క అలా ఓపిక కాగా ఉండొద్దని కాశీ అంటాడు. దీప మంచిది అలాంటోళ్ళు అలా సైలెంట్ గా ఉంటారు కానీ సిచువేషన్ వచ్చినప్పుడు గర్జిస్తారని దాస్ అంటాడు.
ఆ తర్వాత స్వప్న రెడీ అయి వంట చేస్తుంది. అప్పుడే కాశీ వచ్చి భోజనం అంటాడు. ఎప్పుడు వర్క్ అంటావ్.. ఇంట్లో ఉన్న భార్యని పట్టించుకోవు.. ప్రాజెక్ట్ సబ్ మిట్ చేయాలని అంటావంటూ స్వప్నపై కాశీ కాస్త కోపంగా మాట్లాడేసరికి స్వప్న అలుగుతుంది. ఆ తర్వాత కాశీ వచ్చి.. వర్క్ చేసుకుంటుంటే భోజనం తీసుకొని వచ్చి స్వప్న తినిపిస్తుంది. మరొకవైపు ఇక నా కూతురు విషయంలో మీరు ఏది చెప్పినా చేస్తానని శివన్నారాయణతో దశరథ్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ ఫ్రెండ్ ఫోన్ చేసి.. నీ మనవడు రెండో పెళ్లి ఆవిడని పెళ్లి చేసుకున్నాడంట కదా.. నీ అల్లుడు అంటే ఏదో అనుకున్నాను కానీ నీ మనవడు రెండో పెళ్లి చేసుకున్నాడు.. అలాంటి పరువు తక్కువ కుటుంబంలో నుండి సంబంధం తెచ్చి నా మనవడికి ఇవ్వలేను. మీ మానవరాలికి వేరొక సంబంధం చూసుకోమని అంటాడు. పేపర్ ఎక్కడ అని శివన్నారాయణ అనగానే.. సుమిత్ర తీసుకొని వస్తుంది. అందులో కార్తీక్, దీపల రిసెప్షన్ ఫోటో వస్తుంది. అది చూసి శివన్నారాయణ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |