![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. నవవసంతంగా కార్తీకదీపం సీజన్ 2 మొదలవ్వడంతో అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తుంది. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -15 లో... దీప వెళ్తుంటే లేడి పోలీసు తనని ఆపి.. ఐడెంటిఫికేషన్ కి అందుబాటులో ఉండాలని చెప్తుంది. మీరు ఎక్కడ ఉంటారో అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పి వెళ్ళండి.. మళ్ళీ మిమ్మల్ని పిలుస్తామని అంటుంది. దీప ఎక్కడికి వెళ్ళదు.. తన రెస్పాన్సిబిలిటీ నాది అని సుమిత్ర అంటుంది. ఇక్కడే ఉండు దీప అని సుమిత్ర రిక్వెస్ట్ చేస్తుంది. కార్తీక్.. నువ్వు శౌర్యని లోపలికి తీసుకొని వెళ్ళమని చెప్పగానే కార్తీక్ తీసుకొని వెళ్తాడు.
కాసేపటికి దీపని సుమిత్ర పక్కకి తీసుకొని వెళ్లి.. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అసలు నీ సమస్య ఏంటని సుమిత్ర అడుగుతుంది. అయిన ఏం లేదని తను చెప్తుంది. చిన్న పాపని తీసుకొని తిరుగుతున్నావంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా.. నువ్వు ఎక్కడికి వెళ్లకు.. ఇక్కడే ఉండని దీపకి సుమిత్ర చెప్తుంది. మరొకవైపు దీపకి అప్పు ఇచ్చిన మల్లేష్ ఇంట్లో అనసూయ పని చేస్తుంటుంది. అసలు ఆ దీప ఇంకా రావడం లేదని అనుకుంటుంది. అప్పుడే మల్లేష్ వచ్చి.. అనసూయ మతో గొడవపడే ప్రయత్నం చేస్తాడు. ఇక నేను వెళ్తానని దీప బ్యాగ్ తో వచ్చి అందరికి చెప్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అక్కడే దింపుతామని సుమిత్ర అనగానే.. అక్కడ నుండి అయిన సరే నేనే వెళ్ళాలి కదా అని దీప అంటుంది.
ఆ తర్వాత అందరికి చెప్పి దీప వెళ్లిపోతుంటే.. అప్పుడే శివనారాయణ వచ్చి ఆపుతాడు. నువ్వు నా కోడలు ప్రాణాలు కాపాడావు.. రేపు ఉగాది పండుగ కదా.. అందరం కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామని దీపతో శివనారాయణ చెప్తాడు. వెళ్తానంటుంది కదా వెళ్ళానివ్వొచ్చు కదా అని పారిజాతం అనగానే.. శివనారాయణ తనపై కోప్పడతాడు. మాకు బట్టలు లేవని శౌర్య అనగానే.. కార్తీక్ వాళ్ళను షాపింగ్ కు తీసుకొని వెళ్ళని సుమిత్ర చెప్తుంది. అవసరం లేదు మేము వెళ్తామని దీప అంటుంది. మళ్ళీ అటు నుండి అటే వెళ్ళకండని సుమిత్ర చెప్తుంది. ఆ తర్వాత అందరి ముందు మనకు బట్టలు లేవని ఎందుకు చెప్పావంటు శౌర్యపై దీప కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |