![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -723 లో....పారిజాతం కార్ బ్రేకులు తీసేసి జ్యోత్స్నకి చెప్తుంది. ఇప్పుడు ఈ కార్ ఆ సూరజ్ గాడు నడిపేలా చెయ్యాలి.. అప్పుడు వాడి పీడ విరుగడవుతుందని జ్యోత్స్న, పారిజాతం ప్లాన్ చేస్తారు. మరొకవైపు శౌర్యని కాంచన, అనసూయ రెడీ చేస్తారు. దీప నువ్వు ముందు టిఫిన్ చెయ్ తర్వాత ఫోన్ మాట్లాడమని దీపతో అనసూయ అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు.
చూడు బాబు ఇప్పటికి దీప ఏం తినలేదు.. ఎప్పుడు ఫోన్ నే మాట్లాడుతుందని అనసూయ అనగానే నన్నే అసలు పట్టించుకోవడం లేదని కార్తీక్ అనగానే ఏంటే బాబు చెప్పేది నిజమేనా అని అనసూయ అడుగుతుంది. బావ నువ్వు ఏంటని దీప అనగానే అదేం లేదు పెద్దమ్మ దీప తన కడుపులో బిడ్డ కంటే కూడా నాకే ఇంపార్టెన్స్ ఇస్తుందని కార్తీక్ అంటాడు. మీరు ఇద్దరు మంచి భార్యాభర్తలు అని అనసూయ అంటుంది. మరొకవైపు సూరజ్ బయటకి రాగానే జ్యోత్స్న, పారిజాతం యాక్టింగ్ మొదలుపెడుతారు. గ్రానీ పార్లర్ కి వెళ్ళాలి కానీ కార్ స్టార్ట్ అవ్వడం లేదని జ్యోత్స్న అనగానే దాంతో సూరజ్ ని పారిజాతం పిలుస్తుంది. బాబు ఒకసారి కార్ చూడమని పారిజాతం అంటుంది. దాంతో సూరజ్ కార్ ఎక్కి బానే ఉంది కదా అని అంటాడు. అది కాదు ఒకసారి టెస్ట్ చేసి రా కార్ ఏ కండిషన్ లో ఉందోనని తెలుసుకోవచ్చని జ్యోత్స్న అనగానే సూరజ్ వెళ్తాడు. దాంతో ప్లాన్ సక్సెస్ అని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు.
మరొకవైపు మాలిని ఎలాంటిదో కార్తీక్, దీప ఇద్దరితో కాంచన చెప్తుంది. కాంచన మాటలు విన్న కార్తీక్ ఎందుకు అమ్మా అలా అంటున్నావ్ ఆవిడ వల్ల మన కుటుంబానికి ఏమైనా నష్టం జరిగిందా అని కార్తీక్ అనగానే అదంతా ఇప్పుడు అవసరం లేదు. మీరు అయితే జాగ్రత్తగా ఉండండి అని కాంచన చెప్తుంది. మరొకవైపు సూరజ్ కార్ టెస్ట్ చెయ్యడానికి వెళ్లి సేఫ్ గా వస్తాడు. దాంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. అప్పుడ్ కార్తీక్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. మేడమ్ పార్లల్ కి వెళ్ళాలి అంట.. కార్ ప్రాబ్లమ్ లో ఉందంటే టెస్ట్ చేశాను బానే ఉంది.. మీరు ఇక పార్లర్ కి వెళ్లొచ్చని సూరజ్ అనగానే తప్పక పారుని తీసుకొని జ్యోత్స్న అక్కడ నుంచి కార్ లో వెళ్తుంది. జ్యోత్స్న కార్ డ్రైవ్ చేస్తూ బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయని తెలుసుకుంటుంది. ఇక ఇద్దరు టెన్షన్ పడుతారు. ఒక చెట్టు దగ్గర వెళ్లి ఆక్సిడెంట్ చేస్తుంది. అది చూసి సూరజ్, కార్తీక్ వస్తారు. జ్యోత్స్న, పారు షాక్ లో ఉంటారు కానీ ఎవరికి ఏం కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |