![]() |
![]() |
.webp)
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక నాగబాబు ఈ షో గురించి చెప్పారు. "పోటీ ఎలా ఉంటుంది అంటే కత్తులు కటార్లతో పొడుచుకుని చంపేద్దాం అన్న కసితో ఉంటుంది " అన్నాడు. ఇంతలో ఆది పెళ్ళికొడుకు గెటప్ లో షోలోకి మళ్ళీ రి-ఎంట్రీ ఇచ్చాడు. "ఏంటి ఆది సెట్ ఐనట్టు లేదు గెటప్ నీ ఆటిట్యూడ్ కి " అన్నారు నాగబాబు. "హాయ్ బాగున్నావా " అని రష్మిని అడిగాడు. "ఇక్కడ హాయ్ అన్నారు అక్కడ బై అన్నారు " అంటూ రష్మీ అసలు విషయాన్నీ చెప్పింది. ఏదైనా అననివ్వరా నీ పనే బాగుంది విజయ్ గారు కష్టపడి సీఎం ఐతే త్రిష గారు చెయ్యి ఊపినట్టు మేమంతా కస్టపడి స్కిట్స్ చేస్తుంటే నువ్వు హాయ్ అని జస్ట్ చెయ్యి ఊపితే చాలు ఐపోతుంది" అంటూ రష్మీ మీద సెటైర్ వేసాడు ఆది.
"ఎక్కడికెళ్లినా పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. ఒక అమ్మాయిని చూసి చేసుకుందామని దగ్గరకు వెళ్తే నాకు రిచ్ అబ్బాయే కావాలంటోంది. అందుకే రిచ్ ఐపోవాలని జబర్దస్త్ కి వచ్చేసా. ఎందుకంటే ఇక్కడ బెస్ట్ పంచ్ వేస్తె 1000 రూపాయలు. పెర్ఫార్మర్ ఆఫ్ ది డే అంటే 5 వేలు, ఎక్కువ స్కిట్స్ కొడితే 50 వేలు ఇంకా ఎక్కువ కొడితే లక్ష అని ఏదో ఆషాఢం ఆఫర్స్ పెట్టారంటే కదా. కానీ డబ్బులు తీసుకుని నవ్వుకుని వెళ్లే మీరు డబ్బులిచ్చి మరీ నవ్వుకుంటున్నారా" అంటూ ఆది ఆశ్చర్యంగా అడిగాడు. "రోజులలా మారిపోయాయి ఆది " అంటూ నాగబాబు అన్నారు. ఇక జబర్దస్త్ షోలోకి గీతా సింగ్, గంగవ్వ, మహేష్ విట్టా, అదిరే అభి, పృథ్వి, భోలే షావలె, రాగిణి ఇలా చాలామంది ఈ షోలో కనిపించబోతున్నారు.
ఇక నెటిజన్స్ ఐతే రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. "ఓల్డ్ జబర్దస్త్ గుర్తొచ్చింది. రష్మీ వచ్చింది అలాగే మన సుధీర్ కూడా వస్తే ఆ కిక్కే వేరబ్బా. మాటల మంత్రికుడు మా ఆది గారికి స్వాగతం సుస్వాగతం.. ఇప్పుడు వరకూఒకలెక్క ఇకనుంచి ఒకలెక్క వచ్చాడు అది వచ్చాడు.. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సుధీర్ ని , చమ్మక్ చంద్రని కూడా షోలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు.
![]() |
![]() |