![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -63 లో..... గంగ పుట్టినరోజు కోసం పెద్దసారు కుటుంబం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరొకవైపు గంగని చంపాలని ఇషిక, వీరు ప్లాన్ చేసి కేక్ లో ఏదో కలుపుతారు. గంగ రెడి అయి కిందకి వస్తుంది. తనని చూసి శకుంతల ఎమోషనల్ అవుతుంది.
ఆ తర్వాత పెద్దసారు, శకుంతల దగ్గర గంగ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ కేక్ మొత్తం గంగకే తినిపించి మొత్తం పూయాలని ఇషిక అంటుంది. గంగ కేక్ కట్ చేస్తుంది. గంగకి శకుంతల కేక్ తినిపించుబోతుంటే రుద్ర తన చేతిలో నుండి కేక్ తీసుకొని తింటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఏంటి అలా చేసావని పెద్దసారు అడుగుతాడు. గంగ నా బాధ్యత ప్రొద్దున షాపింగ్ మాల్ లో తనపై ఎటాక్ జరిగింది. ఇప్పుడు కేక్ లో ఏదైనా కలిపి ఉండొచ్చు కదా అందుకే తిన్నానని రుద్ర అంటాడు. ఆ తర్వాత గంగకి శకుంతల కేక్ తినిపిస్తుంది..
అదంతా కిటికీలో నుండి లక్ష్మి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. లక్ష్మీ తిరిగి వెళ్తుంటే పైడిరాజు చూస్తాడు. తనని చూసి లక్ష్మీ భయపడుతుంది. ఇది నా భ్రమనా నిజంగానే వచ్చిందా అని పైడిరాజు అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |