![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -55 లో... గంగని రుద్ర పిలిచి మాట్లాడతాడు. నేను ఏమైనా తప్పు చేసానా తిట్టడానికి పిలిచారా అని గంగ భయపడుతుంది. నువ్వు చాలా తెలివైన దానివి గంగ.. ఏ సమస్యనైనా సునాయసంగా దాటగలవు. నేను లేకపోతే కొన్ని పనులు ఆగిపోతాయ్.. అందుకే ఒక ముఖ్యమైన బాధ్యత నీకు అప్పజెప్పాలని అనుకుంటున్నానని రుద్ర అంటాడు.
మరుసటిరోజు ఉదయం అందరు ఈ రోజే కోర్ట్ ఫైనల్ హియరింగ్.. ఒకవేళ శకుంతల కేసు వాపస్ తీసుకోకుంటే రుద్రకి శిక్షపడుతుందని భయపడుతారు. అప్పుడే రుద్ర వస్తాడు. శకుంతల వచ్చి గంగని పిలుస్తుంది. పూజ కోసం పువ్వులు తీసుకొని రమ్మన్నాను కదా.. తీసుకొని వచ్చావా అని అడుగుతుంది. తీసుకుని వచ్చానని గంగ చెప్తుంది. రుద్ర గురించి శకుంతలతో పెద్దసారు మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటే.. నన్ను ఎవరు డిస్టబ్ చెయ్యకండి అని శకుంతల అంటుంది.
గంగని తీసుకొని రుద్ర బయటకు వెళ్తాడు. మరొకవైపు శకుంతల దగ్గరికి వీరు వెళ్లి రుద్రపై ఇంకా కోపం పెరిగేలా మాట్లాడతాడు. మీరు రుద్ర చేసిన పనిని మర్చిపోతున్నారు అత్తయ్య.. గంగని మధ్యలో పెట్టి మీకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నాడని అన్ని గుర్తు చేస్తాడు. దాంతో రుద్రపై శకుంతలకి ఇంకా కోపం పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |