![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 351 లో......రంగా గొంతు మర్చి జయకి ఫోన్ చేసి నువ్వు ఎవరివో అందరికి నిజం చెప్పు లేదంటే నేనే నీ గురించి అందరికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు. దాంతో జయ టెన్షన్ పడుతుంది. గంగ, రుద్ర, రంగా ముగ్గురు కలిసే తన నోటితోనే నిజం చెప్పించాలని ప్రయత్నం చేస్తారు.
ఆ తర్వాత పెద్దసారు దగ్గరికి గంగ వచ్చి పెద్దోరు జయ ఫోన్ చేసింది. మన అందరికి ఏదో విషయం చెప్పాలట వస్తున్నానని చెప్పింది. ఎందుకు తను ఫోన్ లో డల్ గా మాట్లాడిందని గంగ అంటుంది. వీరుకి టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత పెద్దసారు ఇంటికి జయ టెన్షన్ పడుతూ వస్తుంది. ఈ రోజుతో నిజం తెలిసిపోతుందని గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. జయ వచ్చి నేను విశ్వ నాథ్ కూతురు అని చెప్పగానే జయ అని వీరు ఆపబోతాడు. వీరు తనేదో చెప్పాలని అనుకుంటుంది కదా చెప్పనివ్వు అని పెద్దసారు అంటాడు. విశ్వనాథ్ కూతురిని కాబట్టి ఆయన పేరు గౌరవం పెంచాలని అనుకుంటున్నానని జయ చెప్తుంది.
ఆ మాటలు విని గంగ, రుద్ర, రంగ షాక్ అవుతారు. నేను మా నాన్నలాగే గొప్ప బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలి అనుకుంటున్నాను.. అందుకే గంగతో బాక్సింగ్ కి వెళ్తున్నాను.. అందుకే నన్ను ఆశీర్వదించండి అని జయ పెద్దసారు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది జయ. నువ్వు ఏదో కంగారుగా మాట్లాడావని గంగ చెప్పిందని పెద్దసారు అనగానే నేనే మీతో అలా మాట్లాడమని చెప్పానని జయ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |