![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం(Jayam)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-301 లో.. సుధాని తీసుకొని విశ్వ సిటీ వదిలివెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. ఇక వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపడానికి రుద్రని పెద్దసారు పంపిస్తాడు. అక్కడ రంగా, గంగ, పైడిరాజు, లక్ష్మీ, విశ్వ, జయ, సుధా అందరు ఉంటారు. ఎవరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. రంగాకి పెద్దసారు వీడియో కాల్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అంతా చూస్తుంటాడు. పెద్దసారుతో పాటు శకుంతల, ఇషిక, వీరు, ప్రీతీ ఇలా ఇంట్లోని వాళ్ళంతా అక్కడ రుద్ర ఏం చేస్తున్నాడో వీడియో కాల్ లో చూస్తుంటారు.
విశ్వ , సుధా వాళ్ళ లగేజీని కార్ లో ప్యాక్ చేస్తాడు రుద్ర. అత్తమ్మా, మామయ్య పదండి బయల్దేరి వెళ్ళండి అని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. నేను వెళ్ళిపోతునందుకు నీకు బాధగా లేదా అని సుధా అడుగుతుంది. ఎందుకు అత్త మీరు ఎక్కడికి వెళ్తున్నారు.. మళ్ళీ ఫంక్షన్ కో పెళ్ళికో వస్తారు కదా అని రుద్ర అంటాడు. ఇంకా ఆలస్యం చేస్తే రాహుకాలం వచ్చేస్తుంది తొందరగా బయల్దేరి వెళ్ళండి అనగానే గంగా వచ్చి.. ఏంటండి.. సుధ అమ్మ అమ్మ వెళ్ళిపోతుంటే ఆపాల్సింది వెళ్ళమని అంటున్నారేంటని రుద్రని అడుగుతుంది. అవన్న తర్వాత మాట్లాడుకుందాం.. ముందుగా వాళ్ళని వెళ్ళనివ్వు అని రుద్ర అనగానే ఎవరికి ఏమి అర్థం కాదు.ఇక జయ , విశ్వ , కార్ లో కూర్చుంటారు. వెళ్తారు. అదంతా ఫోన్ లో చూసిన పెద్దసారు డిస్సప్పాయింట్ అవుతాడు. ఏంటండి.. మా రుద్ర అది చేస్తాడు.ఇది చేస్తాడు వాళ్ళు వెళ్ళనీయకుండా ఆపుతాడని అన్నారు.. ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో అని శకుంతల అనగానే అయ్యో శకుంతల.. రుద్రని అర్థం చేసుకుంది ఇంతేనా అని పెద్దసారు అంటాడు.
దాంతో అందరు షాక్ అవుతారు. అసలు రుద్ర ఎప్పుడైనా చేసుకొస్తానని చెప్పిన పనిని చేయకుండా వొట్టి చేతులతో వచ్చాడా.. విశ్వ వాళ్ళని ఇక్కడ పంపిస్తున్నాడంటే ఇంకెక్కడో ఆపడానికి ప్లాన్ రెడీ చేసే ఉంటాడని పెద్దసారు అంటాడు. ఇక అనుకున్నట్టుగానే రుద్ర ప్లాన్ చేస్తాడు. బాక్సింగ్ అకాడమీ వాళ్ళు వచ్చి.. సర్ మీరు వెళ్ళడానికి వీల్లేదని అంటారు. దాంతో కొద్ది దూరంలోనే ఉన్న గంగా, రుద్ర, అంతా షాక్ అవుతారు. మీ స్థానంలో ఉండాల్సిన అతను నిరాకరించాడు. మీ భాద్యతలు మీరే నిర్వర్తించాలి.. మీరు సిటీ వదిలి వెళ్ళకూడదని అకాడమీ వాళ్ళు అనడంతో విశ్వ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |