![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -249 లో.....ధీరజ్ రెచ్చగొట్టడంతో రుద్ర తనతో బాక్సింగ్ చేస్తాడు. రుద్ర ఇచ్చిన పంచ్ కీ ధీరజ్ కిందపడిపోతాడు. దాంతో విశ్వ వచ్చి నీ భార్యకి పోటీగా వస్తున్నాడని అలా చేస్తున్నావా అని విశ్వ అంటాడు. ధీరజ్ నువు గెలవాల్సింది బెస్ట్ బాక్సర్ తో బెస్ట్ ఛాంపియన్ తో కానీ ఇలా మత్తుకి బానిస అయిన వాళ్ళతో కాదని విశ్వ అనగానే రుద్ర బాధపడుమతాడు. రుద్ర ఒక దగ్గర కూర్చొని బాధపడుతుంటే గంగ వెళ్లి మీరు చెయ్యలేనిది నేను చేస్తానని రుద్రతో చెప్తుంది. అలా అనగానే గంగని రుద్ర హగ్ చేసుకుంటాడు. అది చూసి మా చెల్లి, బావ ఎప్పుడు ఇలాగే ఉండాలని రంగా అనుకుంటాడు. మరొకవైపు కార్తీక్ సూపర్ మార్కెట్ కి వస్తుంటే కొద్దిలో వెహికల్ డాష్ ఇవ్వడం మిస్ అవుతుంది. అది చూసి మక్కమ్ అన్నట్లు ఒకసారి తల తాకితే ఆక్సిడెంట్ అవుతుందన్నాడు కదా నిజమే కావచ్చు అనుకొని ప్రమీలకి మరొకసారి డాష్ ఇవ్వాలని ట్రై చేస్తాడు.
ఫైల్స్ చూస్తూ ప్రమీల తలకి డాష్ ఇస్తాడు. సారీ అండి మక్కమ్ ఒకసారి డాష్ ఇస్తే ఆక్సిడెంట్ అవుతుందన్నాడు అందుకే మళ్ళీ డాష్ ఇచ్చానని కార్తీక్ అంటాడు. తప్పు అయింది మేడమ్ అని కార్తీక్ అంటాడు. మరొకవైపు అకాడమీ దగ్గరలో పైడిరాజు కార్ క్లీన్ చేస్తూ ఉంటాడు. తనని గంగ చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఈ సర్ దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాను.. మీ అమ్మ కూడా వాళ్ళింట్లో వంట మనిషిగా చేస్తుందని పైడిరాజు అంటాడు. అప్పుడే విశ్వ వచ్చి మా డ్రైవర్ తో మీకు మాటలు ఏంటని అడుగుతాడు. నాన్న అని గంగ అనగానే అంటే ఆ అమ్మాయి నీ కూతురా అని విశ్వ అనగానే అవును సర్ అని పైడిరాజు అంటాడు. డ్రైవర్ కూతురు ఛాంపియన్ అవుతాను సని అనడం అని విశ్వ వెటకారంగా మాట్లాడడం గంగకి నచ్చదు.. దానికి తగ్గట్టుగా గంగ కౌంటర్ వేస్తుంది. చిన్నప్పుడు నీ కూతురికి వస ఎక్కువ పోసావా అని పైడిరాజుని విశ్వ అడుగుతాడు. అది మీకే తెలియాలని పైడిరాజు అనుకుంటాడు.
ఆ తర్వాత లక్ష్మీని తీసుకొని సుధా సూపర్ మార్కెట్ కి వస్తుంది. అక్కడ ప్రమీల ద్వారా గంగ, లక్ష్మి కూతురు అని సుధాకి తెలుస్తుంది. ప్రమీల తన అన్న కోడలు అని కూడా సుధాకి తెలుస్తుంది. ఆ తర్వాత పెద్దసారు సూపర్ మార్కెట్ కి వెళ్లాలని అనుకుంటాడు. ఏంటి వీరు ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నావ్.. నువ్వు ప్రీతిని వదిలేయ్ మీ అత్తయ్య చూసుకుంటుంది. నువ్వు బిజినెస్ చూసుకోమని చెప్పి పెద్దసారు వెళ్ళిపోతాడు. అదే విషయం వీరుతో శకుంతల చెప్తుంది. ఆ తర్వాత వీరు దగ్గరికి ఇషిక వచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |