![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -242 లో..... సూపర్ మార్కెట్ లో కార్తీక్ బర్త్ డే అని తెలిసి అతని చేత కేక్ కట్ చేయిస్తారు. అందరు కార్తీక్ కి కేక్ తినిపిస్తారు. అక్క నువ్వు కూడా తినిపించమని ప్రమీలతో గంగ అనగానే ప్రమీల తినిపిస్తుంది. ఆ తర్వాత వంశీని తీసుకొని ఇన్ స్పెక్టర్ ఇంటికి వస్తాడు. ఏమైందని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఫ్రెండ్స్ తో బైక్ రేసింగ్ చేస్తూ దొరిపోయాడు .. మీ ఫ్యామిలీ సొసైటీలో చాలా మంచి పేరున్నది.. ఇలాంటి పనులు చేస్తే మీ కుటుంబం పరువు ఏమవుతుంది.. ఈ విషయం పెద్దగా కాకుండా ఇంటికి తీసుకొని వచ్చానని ఇన్ స్పెక్టర్ అంటాడు.
దాంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఎందుకు ఇలా చేసావ్ వంశీ.. బుద్ధిగా చదువుకోమని పంపిస్తే ఇలా చేస్తావా అని రుద్ర మందలిస్తాడు. ఈ కుటుంబంలో ఎవరు తప్పు చేసినా పెద్దనాన్నకి బ్యాడ్ నేమ్.. వెళ్లి సారీ చెప్పమని వంశీతో రుద్ర చెప్తాడు. దాంతో
పెద్దసారు దగ్గరికి వంశీ వెళ్లి ఇంకొకసారి ఇలాంటి పని చెయ్యనని చెప్తాడు. ఆ తర్వాత వంశీని నేనే పంపించాను కానీ పోలీసులకి నేను చెప్పలేదు.. వాడు బైక్ రేసింగ్ కి బానిస అయ్యాక చెప్దామనుకున్నాను కానీ ఇలా జరిగింది ఏదైతే ఏంటి ఇంట్లో వాళ్ళకి పరువుపోయే పని అయిందని ఇషికతో వీరు అంటాడు. మరొకవైపు వంశీని తీసుకొని ఇంటికి రమ్మని చెప్పింది నేనే.. దొరికాడని ఇన్స్పెక్టర్ నాకు కాల్ చేసాడు.. వంశీకి భయం ఉంటుందని నేను ఇంటికి వచ్చేలా చేసానని గంగ , రంగాలతో రుద్ర అంటాడు. మరొకవైపు ధీరజ్, విశ్వ భోజనం చేస్తారు. రుద్ర తన భార్యని గెలిపించాలనుకోవడం మూర్కత్వమని ధీరజ్ తో విశ్వ అంటాడు. అలా ఏం కాదు.. తన భార్య టాలెంట్ ని గుర్తించాడని సుధ అంటుంది. ఈ రోజు సూపర్ మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ రుద్ర గంగ కలిశారు. వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అంట.. మనల్ని వాళ్ళింటికి భోజనానికి రమ్మన్నాడని సుధ అనగానే అవేం అవసరం లేదని విశ్వ అంటాడు.
మరొకవైపు శకుంతల దగ్గరికి ఇషిక, వీరు వస్తారు. ఇంట్లో అందరికి మీరంటే భయం పోయింది అత్తయ్య గారు.. తప్పుల మీద తప్పు చేస్తున్నారని వీరు అంటాడు. అప్పుడే స్నేహకి తన ఫ్రెండ్ బైక్ పై లిఫ్ట్ ఇస్తాడు. అది పైనుండి ఆ ముగ్గురు చూసి షాక్ అవుతారు. చూసారా అత్తయ్య ఆ రోజు ప్రమీలని ఏం అనలేదు కాబట్టి ఈ రోజు స్నేహ ధైర్యంగా వచ్చిందని వీరు అంటాడు. ఈ రోజు ఫ్రెండ్ అంటుంది. ఆ తర్వాత లవర్ అంటుందని శకుంతల మైండ్ ని డైవర్ట్ చేస్తాడు వీరు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |