![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -69 లో... లాయర్ వచ్చి.. రుద్ర గారు ఏ తప్పు చెయ్యలేదు కానీ ఇంకెవరో ఇందులో ఉన్నారని చెప్తాడు. అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడున్న వాళ్ళని ఎంక్వైరీ చేయాలని గంగ సలహా ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావని తనపై వీరు కోప్పడతాడు. గంగ చెప్పింది నిజమేనని రుద్ర అక్కడ నుండి బయలుదేర్తారు. రుద్ర సర్ నా మాటకి చాలా విలువ ఇస్తాడు. ఎంతైనా రాజకుమారుడు కదా అని గంగ అనుకుంటుంది.
మరొకవైపు రౌడీలకి వీరు ఫోన్ చేసి.. మీ దగ్గరికే రుద్ర వస్తున్నాడని చెప్తాడు. అప్పుడే రుద్ర రౌడీ దగ్గరికి వస్తాడు. మీ వెనకాల ఉండి నడిపిస్తుంది ఎవరు.. అసలు ఆ సూర్య ఎక్కడ ఉన్నాడని రౌడీలని రుద్ర కొట్టగా హాస్పిటల్ లో కోమాలో ఉన్నాడని చెప్తారు. రుద్రని రౌడీలు సూర్య దగ్గరికి తీసుకొని వెళ్తారు. కోమాలో ఉన్న అతన్ని రుద్ర కొడతాడు. రౌడీలు డాక్టర్ ని పిలిచి కొడుతున్నాడని చెప్తాడు. ఇలా మీరు రావడం కరెక్ట్ కాదని డాక్టర్ అంటాడు. రుద్ర తమ్ముడు సూర్య ఉన్న రూమ్ లో కెమెరా పెడతాడు.
మరొకవైపు రుద్ర మాజీ లవర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది గంగ. ఇప్పుడు రుద్ర సర్ తప్పు చెయ్యలేదని తెలిస్తే తనని వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వస్తారు కదా అని ప్రీతీ వాళ్ళతో గంగ అంటుంది. అయినా రుద్ర అన్నయ్య ఒప్పుకోడని ప్రీతీ అంటుంది. ఆవిడ ఎలా ఉంటుందని గంగ అడుగుతుంది మాకు తెలియదని వాళ్ళు అంటారు. అన్నయ్య తన జ్ఞాపకాలు అన్ని స్టోర్ రూమ్ లో పెట్టారని చెప్పగానే గంగ చూడాలని అనుకుంటుంది. పెద్దసారు గంగ దగ్గరికి వచ్చి నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావ్ కదా అంటాడు.
తరువాయి భాగంలో రుద్ర ఇంకా, తన తమ్ముడు కలిసి సూర్య రూమ్ లో పెట్టిన వీడియో కెమెరా చూస్తారు. ఇప్పుడు కచ్చితంగా ఎవరైతే ఇదంతా చేస్తున్నారో వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తారని రుద్ర, తన తమ్ముడు అనుకుంటారు. అంతలో కోమాలో ఉన్న సూర్య దగ్గరికి వీరు వస్తాడు. అయితే దీని వెనకాల ఉండి నడిపిస్తుంది వీరు అని షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |