![]() |
![]() |

జయమ్ము నిశ్చయమ్మురా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ కి కింగ్ నాగార్జున వస్తే ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. ఇక హోస్ట్ జగపతి బాబు ఐతే కౌబాయ్ గెటప్ లో వచ్చి శ్రీలీలతో ముచ్చట్లు పెట్టారు. "మేమంతా ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం కానీ నువ్వు యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావు" అని జగ్గు భాయ్ అనేసరికి "ఇంతకు నన్ను తిట్టారా పొగిడారా" అనేసింది శ్రీలీల పెద్ద డౌట్ తో. "శ్రీలీల అని పిలవాలా ఏమని పిలవాలి నిన్ను...చాలా లీలలు ఉన్నాయి ఈ లీలో చెప్పు" అని అనేసరికి "వద్దండి..మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా పిలవండి" అంది. "గుంటూరు కారం చేసేటప్పుడు లెఫ్ట్ లోనో రైట్ లోనో ఫేస్ కొంచెం తేడా ఉండేది కదా" అని జగ్గు భాయ్ అడిగేసరికి "ఆ టాపిక్ తీసుకొస్తే నేను మీ టాపిక్ తీసుకొస్తా" అనేసింది. "మీ హీరోయిన్ గారు మీరొకరు" ఆ టాపిక్ మాట్లాడతా అంది శ్రీలీల. "ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టేశావ్" అనడంతో "దూల తీరిపోతుంది సర్" అంది శ్రీలీల.
తర్వాత ఈ షోకి శ్రీలీల వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. ఆవిడ జగపతి బాబు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంది. "మీరు హీరోయిన్ అవ్వాలనుకుని మీ అమ్మాయిని హీరోయిన్ ని చేశారా అది చెప్పండి " అని జగ్గు భాయ్ అడిగారు. తర్వాత శ్రీలీల " మా అమ్మకు మీరంటే చాలా ఇష్టమండి" అని చెప్పడంతో "నువ్వెందుకు సిగ్గుపడుతున్నావ్ " అని అడిగేసారు జగపతి బాబు. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ కి పరిచయమైనా శ్రీలీల ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత గుంటూరు కారం మూవీలో స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. తర్వాత స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ వంటి మూవీస్ లో నటించింది. కానీ ఆ మూవీస్ ప్లాప్ కావడంతో ఈమెకు కొంత అవకాశాలు తగ్గాయి.
![]() |
![]() |