![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -977 లో.. సుభాష్ కి వెన్నునొప్పి రావడంతో డాక్టర్ వస్తాడు. త్వరగా ఆపరేషన్ చెయ్యాలి లేదంటే ఇక ఎప్పటికి నడవలేడు. ఆపరేషన్ కి ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్తాడు. దాంతో కావ్య, అపర్ణ షాక్ అవుతారు. ఆ డబ్బు ఎలా సంపాదిస్తావ్ అమ్మ.. నన్ను ఇలా వదిలేయ్ అని సుభాష్ అంటాడు. లేదు తాతయ్య నాకంటూ ఉంది మీరు ఇద్దరే కదా.. మిమ్మల్ని కాపాడుకుంటాను. రేఖ ఆంటీని డబ్బు అడుగుతానని ఇందు అంటుంది. వద్దని సుభాష్ అంటాడు. అయినా వినకుండా ఇందు వెళ్తుంది.
మరొకవైపు ఐశ్వర్య కోసం నెక్లెస్ కొన్నాను డిజైన్ చుడండి అని భ్రమరాంబకు రేఖ చూపిస్తుంది. చాలా బాగుందని భ్రమరాంబ అంటుంది. అప్పుడే ఇందు వచ్చి నీతో మాట్లాడాలి రేఖ ఆంటీ అని అంటుంది. అయిన రేఖ పట్టించుకోదు అప్పుడే ఐశ్వర్య వస్తుంది. ఆంటీ నేను పార్టీకి వెళ్ళొస్తా.. డబ్బు పంపు అనగానే రేఖ పంపిస్తుంది. ఆంటీ అని ఇందు అంటుంది. తాతయ్యకి ఆపరేషన్ చెయ్యాలని ఇందు చెప్తుంటే.. మీ ఏడుపుకొట్టు సోది ఎప్పుడు ఉండేదే కదా అని ఐశ్వర్య చిరాకుపడుతుంది. అంత డబ్బు అవసరమా డబ్బు ఎక్కడ నుండి వస్తుందని భ్రమరాంబ కోప్పడుతుంది.
ఆ తర్వాత డిన్నర్ కి పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తున్నాడని రేఖ టెన్షన్ పడుతుంది. ఏంటి అంత కంగారు అని భ్రమరాంబ అంటుంది. వచ్చేది పెద్ద బిజినెస్ మ్యాన్ అతన్ని ఇంప్రెస్ చేస్తే ఈ ఆస్తులు మన సొంతం అయ్యాక బిజినెస్ లో సపోర్ట్ ఉంటాడని రేఖ అంటుంది. అప్పుడే అతను వస్తాడు. భోజనం చేస్తారు. వంటలు బాగున్నాయని అతను చెప్తాడు. ఎవరు చేసారని అడుగుతాడు. నేనే అని ఇందు అంటుంది. ఎవరని అతను అడుగుతాడు. పనిమనిషి అన్నట్లు భ్రమరాంబ సమాధానం చెప్తుంది. రేఖ నాదొక రిక్వెస్ట్ ఈ అమ్మాయిని ఒక పూట మా ఇంటికి వంట చెయ్యడానికి పంపించండి అని అడుగుతాడు. అయ్యో మీరు అంతలా అడగాలా అని రేఖ అంటుంది. వస్తుందని అతనికి రేఖ చెప్తుంది. దాంతో అపర్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |