![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -331 లో..... శ్రీవల్లి దాచిన నగలు స్వామి చెప్పినట్లు ఆకులుగా మారాయేమోన్న భయంతో నగలు గొయ్యి తీసి చూడమని భాగ్యం చెప్పాడంతో శ్రీవల్లి గొయ్యి తీసి నగలు చూస్తుంది. ఆకులు ఏం కాలేదు నగలు బాగున్నాయని మురిసిపోతుంది. అప్పుడే ప్రేమ, నర్మద వస్తారు. వాళ్ళని చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. అడ్డంగా దొరికిపోయావ్ ఇదంతా మా ప్లాన్ అని ప్రేమ అంటుంది.
దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతూ.. అసలు ఏం జరిగిందో చెప్తుంది. నాకు నగలు లేవు గిల్టీ ఉన్నాయి.. ఎక్కడ అవి భయటపడుతాయేమోనని ప్రేమ నగల ప్లేస్ లో పెట్టి అవి పంపించాను.. అలా చెయ్యమని మా అమ్మ చెప్పిందని శ్రీవల్లి చెప్తుంది. ఇప్పుడే నీ విషయం మావయ్యకి చెప్తానని ప్రేమ, నర్మద వెళ్తుంటే వద్దని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. కాళ్ళు పట్టుకొని మరి శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. అయిన వినకపోయేసరికి చచ్చిపోతానని బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో ప్రేమని నర్మద ఆపుతుంది. ఆ తర్వాత తిరుపతి దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది.
బాబాయ్ ఈ నగలు ఇన్ని రోజులు నా దగ్గరే ఉన్నాయి.. ప్రేమ సంతోషం కోసం నా దగ్గర దాచాను.. నువ్వు మావయ్య దగ్గరికి వెళ్లి.. నేను మర్చిపోయి నా దగ్గరే ఉంచుకున్నానని చెప్పమని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో తిరుపతి సరే అంటాడు. రామరాజు రాగానే తిరుపతి నగలు తీసుకొని వెళ్లి ఇస్తాడు. దాంతో రామరాజు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |