![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 555 లో.. ప్రేమను ధీరజ్ జ్ఞాపకాల నుంచి దూరం చేయాలనే పేరుతో సేనాపతి ఆమెను ఫారెన్ పంపించాలని అనుకుంటాడు. కానీ భద్రావతి మాత్రం .. ప్రేమ ఎక్కడికీ వెళ్లదు.. ఇక్కడే ఉంటుందంటూ ఆపేస్తుంది. బయటకు ప్రేమపై ప్రేమ చూపించినా, అసలు ఉద్దేశ్యం మాత్రం ధీరజ్‌పై ప్రేమకు అసహ్యం కలిగించడమే. దూరం పంపిస్తే ప్రేమ ఇంకా పెరుగుతుంది. అందుకే ధీరజ్ మీద విషం నాటాలి.. అతని జీవితంలో నుంచి ప్రేమ శాశ్వతంగా వెళ్లిపోయేలా చేయాలని సేనాపతితో అంటుంది. మరోవైపు ధీరజ్ మంచివాడేనని ప్రేమ చెప్పినా, భద్రావతి మాటలతో ఆమె మనసులో మరింత సందేహం పెరుగుతుంది.
ఇక ప్రేమను ధీరజ్‌తో కలిసి కోచింగ్ సెంటర్‌కు పంపించాలని విశ్వా, అమూల్యలు ప్లాన్ చేస్తారు. కానీ ధీరజ్ మాత్రం ప్రేమను తీసుకెళ్లడానికి ఒప్పుకోడు. మనం అనుకున్నాను కాబట్టి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేశాను. ఇప్పుడు ఆ మనంలో నేను అక్కర్లేదన్నారు కదా.. నేను కూడా అదే దారిలో వెళ్తున్నానంటూ కారులో వెళ్లిపోతాడు. దీంతో ప్రేమ మరింత బాధపడుతుంది. చివరకు వేదవతి, నర్మద స్కూటీపై కోచింగ్ సెంటర్‌కు తీసుకెళ్తారు. భార్యాభర్తల మధ్య వేరేవాళ్లు జోక్యం చేసుకుంటే కాపురం ఊపిరాడకుండా అవుతుందంటూ ప్రేమకు అర్థమయ్యేలా చెప్తుంది వేదవతి.
తన బాధను బయటపెట్టిన ప్రేమ.. ధీరజ్ అందరి ముందు నువ్వు ఒక వెధవతో లేచిపోయావు.. నేను తాళి కట్టి నీకు జీవితాన్ని ఇచ్చానని అన్న మాటలను నేను ఎలా మర్చిపోగలనంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే వేదవతి, నర్మదలు ధీరజ్ చేసిన త్యాగాలను గుర్తు చేస్తారు. నీ కోసం ధీరజ్ ఇంట్లో పరాయివాడిలా బతికాడు, ఫుడ్ డెలివరీ చేశాడు, వాటర్ క్యాన్స్ మోశాడు, రాత్రిళ్లు కారు నడిపాడు. నీ చదువు, నీ కల కోసం ఎంతో కష్టపడ్డాడు. ఎంత అవమానం ఎదురైనా నీ చేయి మాత్రం విడిచిపెట్టలేదని చెప్తారు. దీంతో ప్రేమ ఆలోచనలో పడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |