![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -491 లో..... ధీరజ్ అరెస్ట్ అయ్యాడని భాగ్యం వాళ్లు సంతోషపడుతారు. మరొకవైపు ధీరజ్ ని అరెస్ట్ చేయించింది తన పుట్టింటి వాళ్లే అని ప్రేమకి అర్థమై నిలదియ్యాడానికి వెళ్తుంది. భద్రవతి అంటూ గట్టిగా పిలుస్తుంది ప్రేమ. ఏంటే మేనత్తని పేరు పెట్టి పిలుస్తున్నావని భద్రవతి అంటుంది. నువ్వు ఆ విలువ కోల్పోయావ్ నా భర్తని అన్యాయం గా అరెస్ట్ చేయించారని ప్రేమ కోప్పడుతుంది. ఏంటే నీ అన్నని అరెస్ట్ చేస్తే అలా వాళ్ళని నిలదియ్యలేదు.. ఇప్పుడు వచ్చి అడుగుతున్నావని విశ్వ అంటాడు.
నా భర్తతో నీకు పోలిక ఏంట్రా అని విశ్వ చెంప చెల్లుమనిపిస్తుంది ప్రేమ. ఏంటే నీ అన్నని కొడుతున్నావని భద్రవతి అడుగుతుంది. నిజానికి ఆ దెబ్బ నీకు తగలాలి కానీ చిన్నప్పుడు నన్ను అమ్మలా పెంచావని ఆగిపోయానని ప్రేమ అనగానే భద్రవతి షాక్ అవుతుంది. ఏంటే ఎంత మారిపోయావే.. నువ్వు బయటకు నడవ్వే అని ప్రేమ చెయ్ పట్టుకొని బయటకు లాక్కొని వస్తుంటే పెద్దావిడ రేవతి ఆపి.. జరిగిందేదో జరిగింది ఇప్పుడు ధీరజ్ స్టేషన్ లో ఉంటే బాధపడేది మన కూతురు కదా.. రెండు కళ్ళు మనవే అని రేవతి అంటుంది. దాంతో తనపై భద్రవతి కోప్పడుతుంది. ప్రేమని లాక్కొని వెళ్లి బయటకు గెంటేస్తుంటే.. నర్మద వచ్చి ప్రేమని పట్టుకుంటుంది. రామరాజు, వేదవతి,తిరుపతి కూడా ఉంటారు. ఇంకొకసారి నా భర్తని విడిపించమని వస్తే మర్యాదగా ఉండదని భద్రవతి అంటుంది. అంటే ధీరజ్ ని అరెస్ట్ చేయించింది మీరా అని వేదవతి అనగానే అవునని భద్రవతి అంటుంది. మీరు మనుషులేనా అని వేదవతి వాళ్లపై కోప్పడుతుంది. దయచేసి కేసు వెనక్కి తీసుకోండి అని రామరాజు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటే భద్రవతి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు రామరాజుని రెచ్చగొట్టేలా మాట్లాడుతారు. దాంతో రామరాజు, సేనాపతి మధ్య గొడవ జరుగుతుంది. ఆగండి మావయ్య ముందు ధీరజ్ ని ఎలా బయటకు తీసుకొని రావాలో ఆలోచిద్దామని నర్మద అంటుంది.
ఆ తర్వాత వేదవతి ఏడుస్తుంటే అప్పుడే నర్మద వస్తుంది. అసలు ఆ రోజు ధీరజ్, ప్రేమలకి పెళ్లి చేసి తప్పు చేసానని వేదవతి అంటుంటే అలా అనకండి అత్తయ్య అని నర్మద అంటుంది. ఆ మాటలన్ని ప్రేమ విని బాధపడుతుంది. ఆ తర్వాత ధీరజ్ కి ప్రేమ భోజనం తీసుకొని వెళ్తుంది. అక్కడ కానిస్టేబుల్ ని రిక్వెస్ట్ చేసి ధీరజ్ దగ్గరికి వెళ్తుంది ప్రేమ. నేను ఇంటి దగ్గరున్నా నా మనసు అంతా ఇక్కడే ఉందిరా అని ప్రేమ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |